E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: బాబు నీ హెల్త్ బాలేదు నువ్వు బయటికి వెళ్లిపో, ఇదెక్కడి నామినేషన్ సుమన్ అన్న? 

Bigg Boss 9 Telugu: బాబు నీ హెల్త్ బాలేదు నువ్వు బయటికి వెళ్లిపో, ఇదెక్కడి నామినేషన్ సుమన్ అన్న? 
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్బాస్ షో ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ షోలో బాగా ఆసక్తికరమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది నామినేషన్స్ అని చెప్పాలి. ఎందుకంటే గేమ్ నుంచి తొలగించడానికి అవతల వ్యక్తిలోని మైనస్ పాయింట్ లో చూపించి చెప్పడం అనేది నామినేషన్స్ ప్రక్రియ. అవతల వాళ్ళ మైనస్ పాయింట్లును నామినేట్ చేస్తూ చెబుతున్న తరుణంలో విపరీతమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకే చాలామంది సోమవారం జరిగే ఎపిసోడ్ ను మిస్ అవ్వరు.

ఇక ఈరోజు నామినేషన్స్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా జరిగాయి. చాలామంది హౌస్ మేట్స్ మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సుమన్ శెట్టి రీతు మరియు పవన్ ను నామినేట్ చేశారు. రీతుని ఎక్కువగా అరుస్తున్నందుకు నామినేట్ చేశాడు సుమన్ శెట్టి.

హెల్త్ బాలేదు బయటికి వెళ్ళిపో 

Advertisement

బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్ కళ్యాణ్. అయితే కళ్యాణ్ పవన్ కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. పవన్ కి ఉన్న స్ట్రెంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరి మనుషుల్ని కూడా ఆపగలిగే సామర్థ్యం పవన్ కు ఉంది. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేనందువలనే కెప్టెన్సీ టాస్క్ లో కూడా ఓడిపోయాడు.

ఆ టాస్క్ జరుగుతున్నప్పుడే నావల్ల కాదు అని చాలాసార్లు కింద పడుకొని పోయాడు పవన్. అయితే దానినే కారణంగా చూపెడుతూ సుమన్ శెట్టి నామినేషన్ చేశారు. పవన్ నువ్వు చాలా పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్. కానీ నీ ఆరోగ్యం సహకరించకపోవడం వలన నువ్వు సరిగ్గా ఆడలేక పోతున్నావు. కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను నువ్వు ఇంటికి వెళ్లిపోయి రెస్ట్ తీసుకో అని సుమన్ శెట్టి నామినేషన్ చేశాడు.

ఇదెక్కడి నామినేషన్? 

Advertisement

అయితే ఈ విషయం చదువుతున్నప్పుడే ఏదోలా అనిపిస్తుంది కదా. అచ్చం నామినేషన్ చూస్తున్న చాలామందికి కూడా ఇదే ఫీలింగ్ కలిగింది. ఒకరు బాగా ఆడుతున్నారు అన్నప్పుడు వాళ్లు గేమ్ లో ఉండి నిలబడి కప్పు కొట్టాలి అని ఎవరైనా కోరుకుంటారు. ఆ బాగా ఆడే వ్యక్తి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నువ్వు హౌస్ నుంచి వెళ్ళిపో అనడం కరెక్ట్ కాదు. అందుకే హౌస్ మేట్స్ అందరూ కూడా సుమన్ శెట్టి పాయింట్ చూసి నవ్వడం మొదలుపెట్టారు.

నామినేషన్ సీరియస్ గా జరుగుతున్న తరుణంలో భరణి నవ్వడం స్టార్ట్ చేశారు. భరణి ఎప్పుడైతే నవ్వడం మొదలుపెట్టారు అందరూ కూడా నవ్వడం మొదలుపెట్టారు. వెంటనే సుమన్ శెట్టి కూడా సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతారు ఏంటయ్యా అనడం అసలైన కామెడీ. మొత్తానికి పవన్ కూడా దీనిని ఎక్కువ సీరియస్ గా తీసుకోకుండా నవ్వుతూ స్వీకరించాడు.

Also Read : Akhanda 2: దుబాయ్‌ లో అఖండ 2 సినిమాకి అడ్డు, ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×