E-Paper
Advertisement

IBomma Ravi: ఐ బొమ్మ రవికి బెయిల్.. నెక్ట్స్ ఏంటీ, మళ్లీ వాళ్లకు పండగేనా?

IBomma Ravi: ఐ బొమ్మ రవికి బెయిల్.. నెక్ట్స్ ఏంటీ, మళ్లీ వాళ్లకు పండగేనా?
Advertisement

IBomma Ravi: సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి (Immadi Ravi)ఇన్ని రోజులపాటు రిమాండ్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇలా రిమాండ్ లో ఉన్న ఈయనకు పెద్ద ఊరట లభించింది. ఇన్ని రోజులపాటు రిమాండ్ లో ఉన్న రవికి బెయిల్ మంజూరు కావడం విశేషం. తెలంగాణ హైకోర్టు ఈయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పైరసీ (Movie Piracy)చేస్తూ భారీ స్థాయిలో ఐ బొమ్మ రవి డబ్బు సంపాదించుకోవడమే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా కొన్ని వందల కోట్ల నష్టాలు రావడానికి కారణమయ్యారు ఈ నేపథ్యంలోనే పైరసీపై దృష్టి సారించిన అధికారులు ఐ బొమ్మ రవిని నవంబర్ నెలలో అదుపులోకి తీసుకున్నారు.

ఐ బొమ్మ రవికి బెయిల్..

ఇలా అరెస్ట్ అయిన రవిని కోర్టుకు హాజరు పరచడంతో ఈయనను శిక్ష విధిస్తూ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇలా జైలులో ఉన్నటువంటి ఈయన పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు మాత్రం ఈ పిటిషన్ కొట్టి వేస్తూ వచ్చారు.. ఇలా పోలీసులు విచారణలో ఈయన నుంచి అధికారులు పైరసీకి సంబంధించిన ఎన్నో విషయాలను రాబట్టారు. దాదాపు మూడు నెలల పాటు జైలులో ఉన్నటువంటి రవికి బెయిల్ రావడంతో ఎంతోమంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవి అరెస్టు కావడంతో ఒక చిత్ర పరిశ్రమ మాత్రమే ఈయన అరెస్టును స్వాగతించింది కానీ సోషల్ మీడియా వేదికగా రవికి పూర్తిస్థాయిలో మద్దతు లభించిన సంగతి తెలిసిందే.

రవికి పెట్టిన ఆంక్షలు ఇవే..

Advertisement

ఇలా సినిమాలను పైరసీలకు పాల్పడుతూ రవి పోలీసులకు చిక్కడంతో మూడు నెలల అనంతరం బెయిల్ లభించింది. అయితే ఈయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటం విశేషం. రవి జైలు నుంచి బయటకు వచ్చినా, ప్రతిరోజు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కావాలి. విదేశాలకు పారిపోకుండా ఉండటం కోసం ఈయన పాస్ పోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలని తెలిపారు. అదేవిధంగా ఇంటర్నెట్ వాడటానికి కూడా వీలులేదని తెలిపారు. ఒకవేళ ఇంటర్నెట్ వాడాలి అంటే పోలీసుల అనుమతితోనే వాడాలని కోర్ట్ ఆంక్షలు విధించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా నగరం దాటి వెళ్లడానికి వీలు లేకుండా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇలా ఎన్నో ఆంక్షలు నడుమ ఈయనకు బెయిల్ మంజూరు చేశారు.

రవికి బెయిల్..వారికి పండగే..

Advertisement

ఐ బొమ్మ రవి బెయిల్ మీద బయటకు రావడంతో నెక్స్ట్ ఏంటి అంటూ అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈయన బెయిల్ మీద బయటకు రావడంతో సినిమాలను పైరసీలో చూసేవారికి పండుగనే చెప్పాలి. కోర్ట్ కండిషన్ల విషయానికి వస్తే రవి కనీసం ఇంటర్నెట్ కూడా వాడకూడదు అంటూ ఆంక్షలు విధించింది ఇలా ఇంటర్నెట్ వాడకుండా ఉండటం అనేది సాధ్యం కానీ విషయం అయితే ఈయన ఇంటర్నెట్ వాడకపోయినా కోర్ట్ కండిషన్ లను ఫాలో అవుతూ తనకున్నటువంటి నెట్ వర్క్ ద్వారా యధావిధిగా తన పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి . మరి బెయిల్ మీద బయటకు వచ్చిన రవి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

Also Read: Mrunal thakur: దాని కోసం డైరెక్టర్ల వెంట పడక తప్పలేదు..ఊరికే స్టార్లు అయిపోరు: మృణాళ్

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×