Vaibhav Suryavanshi: టీమిండియా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) వివాదంలో చిక్కుకున్నాడు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన సీబీఎస్ఈ పదవ తరగతి బోర్డు (10 board exams) పరీక్షలకు వైభవ్ సూర్య వంశీ దూరమయ్యాడు. బీహార్ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ, ఇవాల్టి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు దూరమయ్యాడు. ఉపాధ్యాయులకు, పాఠశాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ పరీక్షలను స్కిప్ చేశాడట వైభవ్ సూర్య వంశీ. ఈ విషయాన్ని స్వయంగా ప్రిన్సిపాల్ ధృవీకరించారు.
Also Read: IND VS PAK: ఇక పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెలవడం చేతకాక, చివరకు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర
బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ, ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాపులర్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, సెంచరీ తో రెచ్చిపోయాడు. ఆ తర్వాత అండర్ 19 టీమ్ ఇండియా జట్టులో కూడా సత్తా చాటాడు. ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తూ ఇరగదీశాడు. అయితే అలాంటి వైభవ్ సూర్య వంశీ ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పదో తరగతి పరీక్షలు రాయకుండా ఎగనామం పెట్టాడు. పాఠశాల యాజమాన్యానికి సమాచారం కూడా ఇవ్వకుండా పరీక్షలను స్కిప్ చేశాడట వైభవ్ సూర్య వంశీ. ఈ విషయాన్ని స్వయంగా వైభవ్ సూర్యవంశీ చదువుతున్న సమస్తిపూర్ జిల్లాలోని ఏక్సారా హై స్కూల్ ప్రిన్సిపల్ వెల్లడించారు.
టీమిండియాలో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్య వంశీ క్రమశిక్షణ లేని స్టూడెంట్ అంటూ ఏక్సారా హై స్కూల్ ప్రిన్సిపల్ ఫైర్ అయ్యారు. ఇవాల్టి నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనుండగా.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్కిప్ చేశాడని ఫైర్ అయ్యారు. పాఠశాలకు ముందస్తుగా కచ్చితంగా ఏ విద్యార్థి అయినా సమాచారం ఇవ్వాలి.. కానీ వైభవ్ సూర్యవంశీ చీమ కుట్టినట్లు కూడా వ్యవహరించలేదని నిప్పులు చెరిగారు. వాడికి బలుపు ఎక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆడుతూనే పరీక్షలు కూడా రాసుకోవచ్చు కదా? రాయకపోతే తమకు సమాచారం ఇవ్వాలి కదా అంటూ నిలదీశారు ప్రిన్సిపాల్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 13 సంవత్సరాల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. ఒకటి పాయింట్ పది కోట్లకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దీనికి తగ్గట్టుగానే అతనికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో ఓపెనర్ గా కూడా అవకాశం ఇచ్చింది యాజమాన్యం. దానికి తగ్గట్టుగానే అతడు అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఐపీఎల్ 2026 లో కూడా అతడు, రాజస్థాన్ రాయల్స్ లో కీలక పాత్ర పోషించనున్నాడు.
Vaibhav Suryavanshi skipped his Class 10 board exams without informing the school, as confirmed by the principal.
– He is currently focused on IPL preparations.
— Vipin Tiwari (@Vipintiwari952) February 17, 2026