E-Paper
Advertisement

CPI Narayana: అఖండ 2 టికెట్ల రేట్ల పై సీపీఐ నారాయణ ఫైర్.. ఐబొమ్మ రవిని సృష్టిస్తున్నారంటూ!

CPI Narayana: అఖండ 2 టికెట్ల రేట్ల పై సీపీఐ నారాయణ ఫైర్.. ఐబొమ్మ రవిని సృష్టిస్తున్నారంటూ!
Advertisement

CPI Narayana: నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖండ2(Akhanda 2) సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రీమియర్లకు 600 రూపాయలు అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు మల్టీప్లెక్స్ లలో ₹100 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెంచిన ధరలు పది రోజులపాటు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇండస్ట్రీనే ఐ బొమ్మ రవిని సృష్టించింది..

ఈ విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడంతో ఈ విషయంపై పలువురు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుడు సిపిఐ నారాయణ సైతం అఖండ 2 సినిమా టికెట్ల రేట్లు పెంచడం గురించి మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా నారాయణ మాట్లాడుతూ ఇప్పుడే ఏపీ ప్రభుత్వం ఆఖండ2 సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇలాంటి ప్రకటనల ద్వారానే కదా ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టేది. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు చేసి ఆ భారం ప్రజలపై వేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలా సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ప్రేక్షకులు కూడా ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళ సినిమాలను చూస్తున్నారు.

రవిని అరెస్టు చేసే హక్కు పోలీసులకు లేదు..

Advertisement

ఐ బొమ్మ రవి లాంటి వాళ్లను మీరే సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిని అరెస్టు చేసే నైతిక హక్కు కూడా పోలీసులకు లేదని నారాయణ తెలిపారు. రవి లాంటి వాళ్లను అరెస్టు చేస్తే మరి కొంతమంది రవిలు పుడతారని సిపిఐ నారాయణ తెలిపారు. సంపన్నులకు ఊడిగం చేస్తూ సామాన్యులను దోపిడీ చేయడం సరి కాదని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మరో నాలుగు ఐదు సినిమాలు వస్తున్నాయి వాటికి కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచుతారు.

ఇది స్వయంకృతాపరాధమే..

Advertisement

ఇలా ప్రతి ఒక్క సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకుంటూ పోతే ప్రజలకు అధిక భారం అవుతుందని అందుకే ఐబొమ్మ రవి లాంటి వాళ్లు వస్తున్నారని, ఐ బొమ్మ రవి లాంటి వాళ్లను ఆపడం ఎవరి తరం కాదని తెలిపారు. ఇదంతా కూడా స్వయంకృతాపరాధమే ఇలాంటి వాటిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని, ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు చేసి ఆ భారం మొత్తం ప్రజలపై వేస్తున్నారని తద్వారా కళామతల్లికి ప్రేక్షకులను దూరం చేస్తున్నారని తెలిపారు. ఈ చర్యలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని సిపిఐ నారాయణ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నారాయణ వ్యాఖ్యలకు మద్దతుగా ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారు.

 

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×