E-Paper
Advertisement

Daggubati Rana: మెగా హీరోపై రానా ఊహించని కామెంట్స్.. అందుకే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసా!

Daggubati Rana: మెగా హీరోపై రానా ఊహించని కామెంట్స్.. అందుకే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసా!
Advertisement

Daggubati Rana: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి.. మూవీ మొఘల్ దివంగత నిర్మాత రామానాయుడు (Ramanaidu) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి రానా (Daggubati rana)…తన తాతకు తగ్గట్టుగా ఒకవైపు నిర్మాతగా కొనసాగుతూనే.. మరొకవైపు బాబాయ్ వెంకటేష్ (Venkatesh) లాగే నటుడిగా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రానా ఒకవైపు హీరోగానే కాకుండా మరొకవైపు విలన్ పాత్రలతో కూడా అదరగొట్టేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే . అంతేకాదండోయ్ బుల్లితెర టాక్ షో లలో హోస్ట్గా వ్యవహరిస్తూ తనలోని టాలెంట్ ను బయటపెడుతున్నారు కూడా.. ఇలా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకోవడమే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్న రానా.. మెగా హీరో పై చేసిన కామెంట్లు అలాగే తన ఆరోగ్య సమస్యల గురించి ఊహించని కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

అందుకే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసా – రానా

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. “బాహుబలి సినిమా తర్వాత నేను ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా కిడ్నీ, కంటి సమస్యల వల్ల అమెరికాలో చికిత్స తీసుకున్నాను. అయితే ఆ సమయంలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను. అనారోగ్యం కారణంగా శారీరక మార్పులు కూడా రావడంతో అప్పటికే అంగీకరించిన రెజ్లర్ కథ వంటి ప్రాజెక్టుల అడ్వాన్సులను నిర్మాతలకు తిరిగి ఇచ్చేసాను”. అంటూ రానా తెలిపారు.

నా సినిమాలు మెగా హీరోకి ఇచ్చేద్దాం అనుకున్నాను..

Advertisement

ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ..” నేను నా స్నేహితుడు మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej)ని చూసినప్పుడు.. నేను తీసుకున్న ప్రాజెక్టులను వరుణ్ తేజ్ కి ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ కొన్ని కారణాలవల్ల అది కుదరలేదు” అంటూ తెలిపారు. మొత్తానికైతే మెగా హీరో వరుణ్ తేజ్ పై ఆయన చూపిన ప్రేమ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఏదేమైనా ఇండస్ట్రీలో ఒకరే అన్ని సినిమాలు చేయాలని లేదు.. తమ దగ్గరకు వచ్చిన సినిమాలకు ఇంకొకరిని సజెస్ట్ చేయడంలో తప్పులేదు.. ఇప్పటికే చాలామంది హీరోలు కూడా తమ వద్దకు వచ్చిన సినిమాలు తమకు సెట్ కాకపోతే ఇండస్ట్రీలో ఎవరికి బాగా సెట్ అవుతుందో కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు..అలా మొత్తానికి అయితే తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు తన సినిమాలను తన స్నేహితుడు వరుణ్ తేజ్ కి ఇద్దామని అనుకున్నానని రానా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం రానా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Movie Titles: టైటిల్ మారితే తిరుగులేని హిట్టే.. సుహాస్ ‘హే బల్‌వంత్’ కూడా అదే బాటలో!

రానా ప్రస్తుత సినిమాలు..

Advertisement

రానా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..చివరిగా దుల్కర్ సల్మాన్ తో కలిసి కాంత సినిమాలో నటించడమే కాకుండా ఆ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు. మరొకవైపు మిరాయ్ సీక్వెల్ సినిమాలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే కృతికర్బంధాతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు.. అలాగే తేజా దర్శకత్వంలో రాక్షస రాజా అనే సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×