E-Paper
Advertisement

Podarillu Today Episode : మహాను మోసం చేసిన చక్రీ.. నిజాలు చెప్పిన నారాయణ.. లలిత ప్లాన్ వర్కౌట్..?

Podarillu Today Episode : మహాను మోసం చేసిన చక్రీ.. నిజాలు చెప్పిన నారాయణ.. లలిత ప్లాన్ వర్కౌట్..?
Advertisement

Podarillu Today Episode February 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. సిమ్ యాక్టివేట్ అవ్వడంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న నా కూతురు ఒకప్పుడు ఉండేది అమ్మ ఇప్పుడు లేదు ఆమె చచ్చిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి ఏ కష్టం వచ్చి ఫోన్ చేసిందో అర్థం చేసుకోరా అని ప్రతాప్ ని ఎంతగా బ్రతిమిలాడినా సరే.. అతను మాత్రం ఇక చాలు ఆపండి అని కోపంగా అంటాడు. మహా తన వాళ్లు అన్న విషయాన్ని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.. చక్రి మహా దగ్గరికి వచ్చి ఏమైందో అని అడుగుతాడు ఆ విషయం చెప్పి తను చాలా ఫీల్ అవుతుంది..

తన ఇంట్లో వాళ్ళు తను చచ్చిపోయింది అని చెప్పగానే మహాలక్ష్మి చాలా బాధపడుతుంది.. ఇక రాత్రి తన తండ్రి అన్న మాటని తెలుసుకుని బాధపడుతూ ఉండగా చక్రి లోపలికి వస్తాడు.. మహాలక్ష్మి ఏడుస్తూ కనిపించడం చూసిన చక్రీ ఏమైందండీ ఏడుస్తున్నారు ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పండి అని అడుగుతాడు.. ఊరంతా తిప్పి చూపిస్తాడు చక్రి. ఇక ఉదయం లేవగానే అందరూ కలిసి మహా చెప్పినట్టు విని పనిచేస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో పూజలు అలాగే ముగ్గు పెట్టడం చూసి కన్నా ఎమోషనల్ అయిపోతాడు.. ఇక ఆ తర్వాత మహాలక్ష్మి నేను టీ పెడతాను అని అంటుంది… మహాలక్ష్మి చేసిన వింత ప్రయోగానికి ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు.. ఆ తర్వాత చక్రి దోశలు వేస్తూ మాధవ్ చట్నీ చేస్తూ ఉంటాడు.. అయితే చక్రి చేసిన పనికి మాధవ్ షాక్ అవుతాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి వంట చేస్తూ ఉండగా మహాలక్ష్మి ఇంటికి వస్తుంది.. వంటగదిలోకి రాగానే పెద్ది నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది.. రూమ్ సమస్య కదా అమ్మ నేను చూసుకుంటాను అని మాధవ్ అంటాడు.. అదే కాదు ఇంకొక సమస్య కూడా ఉంది పెద్ది. నాకు మీరు ఆర్కిటెక్ కదా ఒక జాబ్ చూపించండి అని అడుగుతుంది ఆ మాట వినగానే మాధవ్ షాక్ అవుతాడు.

ఏదో ఒకటి చెప్పు మ్యానేజ్ చెయ్ అన్నయ అని చక్రి అడుగుతాడు. సరే అమ్మ నేను నీకు జాబ్ వచ్చేలా చూస్తాను అని మాధవ్ మాట ఇస్తాడు. మాటిచ్చాడంటే కచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి రాత్రి ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. అయితే అప్పుడే ఇంట్లోకొచ్చిన నారాయణ చూసి షాక్ అవుతుంది. కానీ నారాయణ మాత్రం ఇంట్లో ఎవరూ లేరా అని అడుగుతాడు. నారాయణ వంటగదిలోకి వెళ్లి చేయి లోపల పెట్టి నీళ్లు తెచ్చుకోవడం చూసిన మహా ఇంత కేర్ లెస్ గా ఎలా చేస్తారు అని అసహ్యించుకుంటుంది.ఇక తర్వాత నారాయణ మహాని కూర్చోమని చెప్తాడు. మహా మాట్లాడుతూ ఉంటుంది అయితే నా చరిత్ర గురించి నీకు చెప్పాలని తన చరిత్ర మొత్తాన్ని చెప్తాడు.

Advertisement

నారాయణ ప్రవర్తన చూసి భయపడిపోయిన మహాలక్ష్మి ఇంటి నుంచి బయటకు వస్తుంది. అప్పుడే ఇంటికి వస్తున్న కన్నా చక్రి మహా బయటుండడం చూసి ఏమైంది అని అడుగుతారు. నారాయణ చేసిన పనికి తాను భయపడిపోయిన విషయాన్ని వాళ్ళతో వివరిస్తుంది. ఇక ఆ మాట వినగానే కన్నా బాధపడిపోతాడు. నీకోసం నేను ఉండాల్సింది వదిన నేను కూడా అలాగా వచ్చేసాను సారీ వదినా అని కన్నా అంటాడు. ఎప్పుడు ఇంట్లో ఉండి నువ్వేం చేస్తావ్ ఏం కాదులే పద ఇంటికి వెళ్దాం అని ఇద్దరు నడుచుకుంటూ వస్తారు.. ముందుగా ఇంటికి వెళ్లిన చక్రి నీకు కొంచమైన బుద్ధుందా? ఒక ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలని కూడా తెలియదా నీకు అని అడుగుతాడు.

ఇంట్లో అందరూ మగాళ్లు ఉన్నారు కదా నాకు ఎలా ఉండాలో తెలియదు ఇప్పుడు ఏమైంది అని నారాయణ అంటాడు.. నా ఇంట్లో నేను ఉండడానికి నీ పర్మిషన్ ఏంట్రా అని నారాయణ అంటాడు. ఇక మహా ఎందుకు గొడవ పడుతున్నారు వదిలేయండి అని లోపలికి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత రోజు మహా హారిక కు ఫోన్ చేస్తుంది. హారిక ఆ విషయాన్ని ఎలాగైనా సరే అత్తయ్యకి చెప్పాలి అని ఉంటుంది. హారిక ఎలాగైనా సరే ఆ విషయాన్ని అత్తయ్యతో చెప్పాలి అని అనుకుంటుంది. మహాలక్ష్మి ఆ ఇంట్లో ఉండలేనని చెప్తుంది అత్తయ్య నాకు ఫోన్ చేసి చెప్పింది అని అనగానే లలిత కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అప్పుడే ఆ ఇంట్లో వాళ్ల గురించి తెలుసుకొని అది ఇబ్బంది పడుతుందా? ఇకమీదట నేను ఏది ఊరుకోను నా బిడ్డకి ఏమన్నా అయితే నేను సహించలేను. ఈ విషయాన్ని వెంటనే వాళ్ళతో చెప్పాలి అని లలిత హారిక ఇద్దరు కూడా ప్రతాప్ దగ్గరికి వెళ్తారు. మహా పడుతున్న ఇబ్బందులు గురించి వాళ్ళు అక్కడ చెప్తారు. అని ప్రతాప్ మాత్రం ఏమీ చేయలేను అన్నట్లుగా మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత మాధవ్ చక్రిని పక్కకు తీసుకొని వచ్చి అరే నువ్వు నా గురించి ఎందుకురా అబద్దాలు చెప్పావు అని అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన కేశవ వీడికి అబద్ధాలు చెప్పడం మాత్రమే వచ్చు అని గొడవకు దిగుతాడు.

Also Read : శృతికి సారీ చెప్పిన రవి.. ముసలోళ్ళుగా మారిన మీనా, బాలు..రోహిణి ప్లాన్ రివర్స్..

తర్వాత రోజు ఉదయం ఎవ్వరూ లేయకముందే మహాలక్ష్మి లేచి పూజ చేస్తుంది. అక్కడికొచ్చిన మాధవ చక్రి ఈరోజు ఏమైనా విశేషం ఉందా ఇంత త్వరగా లేచి పూజ చేశారు అని అడుగుతారు. ఏం లేదు శుక్రవారం కదా.. ఉదయం లేచి పూజ చేయడం అలవాటు అందుకే చేశాను అని అంటుంది. అయితే అప్పుడే అక్కడికి గాయత్రి వచ్చి మహాలక్ష్మికి తన గురించి చెప్తుంది.. ఇక ఇంట్లో ఏదో మంచి వాసన వస్తుంది అని వంట గదిలోకి వెళ్లి గాయత్రి మాధవ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి గురించి తెలుసుకున్న మహా ప్రైవసీవ్వాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×