E-Paper
Advertisement

NagaDurga: నాకు అది అస్సలు రాదు.. బిగ్ బాస్ రిజెక్ట్ పై నాగ దుర్గ రియాక్షన్..

NagaDurga: నాకు అది అస్సలు రాదు.. బిగ్ బాస్ రిజెక్ట్ పై నాగ దుర్గ రియాక్షన్..

NagaDurga: ఈ మధ్య యూట్యూబ్ లో స్పెషల్ డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. కొంతమంది చేసిన డ్యాన్స్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు ఆ డ్యాన్సర్ అతి కొన్ని పాటలతోనే బాగా పాపులర్ అవుతున్నారు.. యూట్యూబ్ లో స్పెషల్ ఫోక్ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ చాలా మంది బాగా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో యూట్యూబ్ సెన్సేషన్, ఫేమస్ ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ ఒకరు. ఫోక్ డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. డ్యాన్సర్ ఇప్పటివరకు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాల్లో కి కూడా ఎంట్రీ ఇచ్చింది.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలను చేస్తుంది.. అయితే ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా బిగ్ బాస్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్.. 

బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో 9 వ సీజన్ ప్రసారం అవుతుంది.. ఈ షోలో ఒక్కరోజు అయిన పాల్గొనాలి అంటుకుంటారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి వస్తే బాగుండునని అందరు భావిస్తారు. కొందరు సినిమాల కారణంగా బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేస్తుంటారు.. తాజాగా యూట్యూబ్ డ్యాన్సర్ నాగ దుర్గ కూడా అదే చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ దుర్గ బిగ్ బాస్ గురించి మాట్లాడారు. మీకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని బయట టాక్.. అందులో నిజమేంత ఉందో చెప్పండి అని యాంకర్ అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్పింది. నాకు బిగ్ బాస్ ఆఫర్ రావడం నిజమే. మా ఇంట్లో వాళ్లు కూడా వెళ్లమని చెప్పారు.. కానీ నేనే వద్దని చెప్పేసాను. సినిమాలు ఉండటం వల్ల కుదరదు అనుకున్నాను మరో విషయం ఏంటంటే నాకు గొడవ పడటం రాదు.. అందుకే వద్దని అనుకున్నా అని ఆమె అన్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు..

నాగ దుర్గ చేసిన సాంగ్స్ & సినిమాలు.. 

ఫోక్ సాంగ్స్ కు తనదైన స్టైల్లో అదిరిపోయే స్టెప్పులు వేసింది నాగ దుర్గ.. బిగ్ బాస్‌పై ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. మిమ్మల్ని మరింతగా వెయిట్ చేయించాలని నేను అనుకోవడం లేదు.. నాకు ఇంట్రెస్ట్ లేదు అని గతంలో ఆమె అన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మరోసారి ఆమె ఇంటర్వ్యూ తో బిగ్ బాస్ పై తన ఫీలింగ్ ను బయట పెట్టింది.. నాలుగేళ్ల వయసులోనే కూచిపూడి, 14 ఏళ్ల వయసులో పేరిణి నాట్యం నేర్చుకుని స్టేజీలపై పలు ప్రదర్శనలిచ్చారు.. ఆమె సొంత డ్యాన్స్ అకాడమి కూడా ఉంది. ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి’, ‘దారిపొంటత్తుండు’, ‘నా పేరే ఎల్లమ్మ’ తిన్న తిండి పడతలే బావ వంటి సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ఒకవైపు సాంగ్స్ తో పాటుగా సినిమాలు కూడా చేస్తుంది.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×