E-Paper
Advertisement

OTT Movie : అబ్బాయిల్ని రెచ్చగొట్టి కొల్లగొట్టే తల్లీకూతుర్లు… క్షణక్షణం ఉత్కంఠ రేపే సైకో థ్రిల్లర్

OTT Movie : అబ్బాయిల్ని రెచ్చగొట్టి కొల్లగొట్టే తల్లీకూతుర్లు… క్షణక్షణం ఉత్కంఠ రేపే సైకో థ్రిల్లర్

OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా ఈ మధ్య సినిమాలు బాగా వస్తున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ లను, సైకో కిల్లర్ స్టోరీలను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 1990లలో భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన రియల్ స్టోరీ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం సీరియల్ కిల్లర్స్ అంజనా, ఆమె ఇద్దరు కుమార్తెలు సీమా గవిత్, రేణుకా షిండేల నిజమైన కథ ఆధారంగా తెరకెక్కింది. వాళ్ళు 1996 నాటికి 40 మందికి పైగా పిల్లలను కిడ్నాప్ చేసి దాదాపు 12 మంది పిల్లలను హత్య చేశారు. వణుకు పుట్టించే ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘పోషమ్ పా’. 2019లో విడుదలైన ఈ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో మహి గిల్ , సయాని గుప్తా , రాగిణి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఐయండిబి 6.3/10 రేటింగ్ తో ZEE5లో మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

అంజనా, తన ఇద్దరు కుమార్తెలు సీమ, రేణుకతో కలిసి పిల్లలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటుంది. వీళ్ళు పేద కుటుంబాల పిల్లలను, రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్‌ల దగ్గర పెట్టి భిక్షాటన చేయించే వాళ్ళు. ఈ ముగ్గురూ కలిసి 40 మందికి పైగా పిల్లలను కిడ్నాప్ చేశారని, వారిలో 12 మందిని క్రూరంగా హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంజనా తన కుమార్తెలను ఈ భయంకరమైన పనులలోకి ఎలా లాగింది, వాళ్ళు తల్లి మాటలకు ఎలా బానిసలయ్యారు అనే విషయాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఈ ముగ్గురూ తమ నేరాలను ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఒక ఆటలాగా చేసేవాళ్ళు.

Read Also : ట్యూషన్ టీచర్‌పై ప్రేమ… ప్రేమించిన వాడు దక్కలేదని ఆ పిల్ల చేసే పనికి ఫ్యూజులు అవుట్

ఈ నేరాలలో తల్లి పాత్ర కీలకంగా ఉంటుంది. ఆమె తన కుమార్తెలను నేరస్థులుగా మార్చి, ఈ దారుణాలకు ఉసిగొల్పింది. ఈ సినిమా డాక్యుమెంటరీ తరహాలో సాగుతూ, ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వాళ్ళ మానసిక స్థితిని, ఈ దారికి ఎలా వచ్చారు అనే విషయాలను చూపితునది. చివరికి ఈ ముగ్గురు పోలీసులకు పట్టుబడతారు. కోర్టు వాళ్ళు చేసిన దారుణాలకు ఉరిశిక్ష విధిస్తుంది. అయితే అంజనా జైల్లో ఉన్నప్పుడే మరణిస్తుంది. కానీ సీమ, రేణుకలకు 2014లో ఉరిశిక్ష ఖరారవుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల మనసులో ఒక ప్రశ్నను మెదిలేలా చేస్తుంది. ఈ అక్కా చెల్లెళ్ళు కేవలం తమ తల్లి చేతిలో పావులుగా మారిన బాధితులా ? లేక తమ స్వంత ఇష్టంతో ఈ దారుణాలకు పాల్పడిన క్రూరమైన నేరస్థులా? అని ఆడియన్స్ పోల్ కి వదులుతుంది.

 

Related News

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Big Stories

×