Darling Re Release : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య రీ రిలీజ్ ల నడుస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి., మళ్లీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాలు దాదాపు రీ రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ డార్లింగ్ కూడా మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా హిట్ అవడంతో పాటుగా మళ్లీ థియేటర్లోకి వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం అస్సలు తగ్గలేదు. మరి డార్లింగ్ మూవీ ఇప్పటివరకు ఎన్ని లక్షలు కలెక్షన్స్ ని వసూలు చేసిందో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ప్రభాస్ సినిమాలకు డిమాండ్ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే.. డార్లింగ్ నటిస్తున్న సినిమాలు మాత్రమే కాదు. గతంలో నటించిన సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ థియేటర్లలోకి వస్తున్నాయి. తాజాగా ఆయన డార్లింగ్ మూవీ మరోసారి థియేటర్లలో రిలీజ్ అయ్యింది.. ఈ చిత్రం బిజినెస్ కూడా బాగా జరగడంతో కలెక్షన్స్ కూడా ఎక్కువగానే వసూల్ అయ్యాయి. 4K క్వాలిటీ కి మార్చి , డాల్బీ అట్మాస్ సౌండ్ తో నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు.. ప్రీరిలీజ్ ప్రీ బుకింగ్స్ తో పాటుగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 4 కోట్ల 92 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.. ఈ మూవీకి దాదాపు 6 కోట్లు వసూల్ అయ్యాయి.. సమ్మర్ లో కొత్త రిలీజ్ లు ఫ్లాప్ అయ్యి, థియేటర్స్ మూత పడుతున్న సమయంలో ఇలా డార్లింగ్ రిలీజ్ అయింది.. ఏది ఏమైనా కూడా మొదటి రోజు ఇన్ని కోట్ల కలెక్షన్ రావడంతో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది..
ప్రభాస్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొత్త సినిమాలు మాత్రమే కాదు పాత సినిమాలు కూడా రిలీజ్ అవుతూ మరోసారి కలెక్షన్ వర్షం కురిపిస్తున్నాయి. రీసెంట్ గా డార్లింగ్ నటించిన డార్లింగ్ చిత్రం రీ రిలీజ్ అయింది.. అప్పట్లో ఈ మూవీ ఎంత క్రేజ్ ని సంపాదించుకుందో ఇప్పుడు కూడా అంతే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా భారీగానే వసూల్ అయ్యాయి. ఏ ఏరియాలో ఎంత వసూల్ అయ్యాయి అంటే.. నైజాం లో దాదాపు కోటి. 90 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 62 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 20 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 40 లక్షలు, ఉభయ గోదావరిలో 63 లక్షలు, అన్ని రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ నుండి 42 లక్షల వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు…