E-Paper
Advertisement

Garuda Purana Part 08: గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?

Garuda Purana Part 08: గరుడపురాణం ప్రకారం ఆత్మ నరకలోక ప్రయాణంలో 8వ పట్టణం విచిత్రభవనం చేరుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా..?
Advertisement

Garuda Purana Part 08: గరుడపురాణంలోని ప్రేతకల్పం చెప్పినట్టు ఆత్మ తన యమలోక ప్రయాణంలో అత్యంత కష్టాలు, శిక్షలు అనుభవిస్తూ ప్రయాణిస్తుందట. అయితే తన ప్రయాణంలో ఆత్మ 8వ పట్టణమైన విచిత్రభవనానికి చేరుకుంటుందట. అక్కడ ఆత్మకు ఎలాంటి శిక్షలు వేస్తారు.. ఆత్మ పడే యాతన ఏంటి..? లాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం, జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత యమలోకానికి చేసే ప్రయాణం అత్యంత కఠినమైనదిగా వర్ణించబడింది. ఈ ప్రయాణంలో విచిత్ర భవనం అనేది ఒక ముఖ్యమైన పట్టణమట.

Advertisement

విచిత్ర భవనానికి చేరుకోవడానికి పట్టే సమయం: జీవుడు తన ప్రయాణాన్ని ప్రారంభించిన 200 రోజుల తర్వాత అంటే సుమారు 7 నెలల తర్వాత విచిత్ర భవనం’ అనే నగరానికి చేరుకుంటాడట.

ఆత్మ అక్కడికి ఎలా చేరుకుంటుంది?: మరణానంతరం జీవుడికి లభించే యాతనా శరీరం ద్వారా యమదూతలు ఆ ఆత్మను పాశాలతో బంధించి తీసుకువెళ్తారట. కేవలం వాయు వేగంతో వారు లాక్కువెళ్తుంటే, ఆత్మ ఆకలి దప్పులతో అలమటిస్తూ, అడవులు, ఎడారులు మరియు నదుల గుండా ప్రయాణిస్తుందట.

Advertisement

మార్గమధ్యలో అనుభవించే కష్టాలు: యమలోక ప్రయాణం మొత్తం సంవత్సనర కాలం పాటు సాగుతుందట (వైతరణి నది దాటడం వంటివి కలిపి). విచిత్ర భవనానికి చేరుకునే లోపు ఆత్మ ఎన్నో ఇబ్బందులను, కష్టాలను  ఎదుర్కొంటుందట. తీవ్రమైన ఆకలితో ఆత్మ నరకయాతన అనుభవిస్తుందట. మార్గంలో ఎక్కడా ఆహారం, నీరు లభించవు. కేవలం బంధువులు పెట్టే ‘షోడశ పిండాలు’ మాత్రమే ఆత్మకు శక్తినిస్తాయట. ఒకవైపు ఎముకలు కొరికే చలి అంతలోనే మండుతున్న ఎండలు, కత్తుల వంటి ఆకులున్న అడవులు (అసిపత్ర వనం) ఆత్మను ఇబ్బందులకు గురి చేస్తుంటాయట. ఇక పాపాలు చేసిన ఆత్మలను యమదూతలు కర్రలతో కొడుతూ, భయపెడుతూ ముందుకు నడిపించడం మరో రకమైన ఘోర శిక్ష ఉంటుందని గరుడపురాణంలో ఉందట.

విచిత్ర భవనంలో అనుభవించే శిక్షలు: విచిత్ర భవనం అనేది యమధర్మరాజు సోదరుడైన విచిత్రుడు పరిపాలించే ప్రాంతం. ఇక్కడ ఆత్మ అనుభవించే స్థితి అతి భయంకరంగా ఉంటుందట. అక్కడకు వెళ్లగానే ఆత్మకు తన పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయట. “నేను ఎందుకు ఇన్ని తప్పులు చేశాను?” అని ఆత్మ తీవ్రంగా బాధపడుతుందట. తాను భూలోకంలో వదిలివచ్చిన బంధువులు, ఆస్తుల గురించి తలుచుకుని విలపిస్తుందట. ఇక్కడి నుండి యమపురికి ప్రయాణం మరింత కఠినంగా ఉంటుందని యమదూతలు హెచ్చరిస్తూ, ఆత్మను మరింత భయపెడతారట.

NOTE: ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో  9వ పట్టణమైన బహుపాదపురానికి  ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గరుడపురాణం ప్రకారం ఆత్మకు క్రూరత్వాన్ని చూపించేదే క్రూరపురం – ఆత్మ చేరుకునే 7వ పట్టణం ఇదే

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×