Dasari Narayanarao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ పెద్ద అంటే అందరికీ టక్కున దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు (Dasari Narayanarao) గారు గుర్తుకు వస్తారు. ఈయన సినీ పెద్దగా ఇండస్ట్రీలో కార్మికుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించి ఇండస్ట్రీలో ఒక స్నేహపూరిత వాతావరణాన్ని తీసుకువచ్చారు. ఇక దాసరి నారాయణరావు గారు మరణించిన తర్వాత ఇండస్ట్రీ పెద్దదిక్కును కోల్పోయిందని చెప్పాలి. ఇక దాసరి నారాయణరావు కెరియర్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా నటుడిగా నిర్మాతగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇక దాసరి గారి వారసులుగా ఆయన కుమారులు ఇండస్ట్రీలో నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ నటి దాసరి నారాయణరావు గారు మా తాతయ్య అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న డింపుల్ హైయతి (Dimple Hayathi)రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన తాతయ్య దాసరి నారాయణరావు గారని సీనియర్ నటి ప్రభ నాన్నమ్మ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె దాసరి గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో సమస్యలు ఉంటే మా ఇంటికి వచ్చేవి మా ఇల్లు దాటి బయటకు వెళ్లేవి కాదని తాతగారు అంత బాగా హ్యాండిల్ చేసేవారు అంటూ దాసరి గొప్పదనం గురించి తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మరో విషయాన్ని తెలియజేశారు. దాసరి నారాయణరావు గారు అనారోగ్యానికి గురయ్యే ముందు టాలీవుడ్ స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో సినిమా చేయాలని అనుకున్నారని ఈమె తెలియజేశారు. ఈ సినిమాకు కల్కి అనే టైటిల్ పెట్టాలనుకున్నట్లు డింపుల్ తెలిపారు.
స్క్రిప్ట్ కూడా సిద్ధం..
తాతగారు మరణించే సమయానికి నాకు 15 సంవత్సరాల వయసు అప్పట్లో పెద్దగా తెలిసేది కాదు కానీ ఆయన స్క్రిప్ట్ రాసిన పేపర్లను తాను చదివానని, తాతగారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనుకున్నారు అంటూ ఈ సందర్భంగా డింపుల్ హైయతి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దాసరి గారు బ్రతికే ఉంటే కల్కి సినిమా పవన్ కళ్యాణ్ చేసి ఉండేవారా అంటూ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్ని రోజులపాటు ఈ విషయాన్ని బయట పెట్టకుండా డింపుల్ హైయతి ఇప్పుడు దాసరి నారాయణరావు తన తాతయ్య అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jayakrishna: నా లైఫ్ లో బాబాయ్ చాలా ఇంపార్టెంట్.. మొదటి స్పీచ్ తో ఆకట్టుకున్న ఘట్టమనేని వారసుడు!