E-Paper
Advertisement

Jayakrishna: నా లైఫ్ లో బాబాయ్ చాలా ఇంపార్టెంట్.. మొదటి స్పీచ్ తో ఆకట్టుకున్న ఘట్టమనేని వారసుడు!

Jayakrishna: నా లైఫ్ లో బాబాయ్ చాలా ఇంపార్టెంట్.. మొదటి స్పీచ్ తో ఆకట్టుకున్న ఘట్టమనేని వారసుడు!
Advertisement

Jayakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ(Krishna) గారికి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఘట్టమనేని హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న కృష్ణ గారి లెగసీని ఆయన కుమారుడు మహేష్ బాబు (Mahesh Babu) కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలోకి మూడోతరం అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కృష్ణ మొదటి కుమారుడు దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడిగా జయకృష్ణ (Jayakrishna)ఘట్టమనేని అందరికీ ఎంతో సుపరిచితమే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram) అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి జయ కృష్ణ పరిచయం కాబోతున్నారు.

కృష్ణ గారు గర్వపడేలా..

ఇన్ని రోజులు పాటు మీడియాకు దూరంగా ఉన్న జయకృష్ణ మొదటిసారి బహిరంగ వేదికపై తన కుటుంబం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయవాడలో లెనిన్ సర్కిల్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జయకృష్ణ హాజరయ్యారు. ఈ విగ్రహవిష్కరణ అనంతరం జయకృష్ణ మాట్లాడుతూ.. నేను ఏ పని చేసిన అందులో కృష్ణ గారు నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న భావన నాకు కలుగుతుందని తెలిపారు. చిన్నప్పటి నుంచి తాతయ్య, బాబాయ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, నా జీవిత ఆశయం కృష్ణ గారు గర్వపడేలా చేయటమేనని తెలిపారు.

బాబాయ్ సినిమాలు చూస్తూ పెరిగా..

Advertisement

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా మాట్లాడుతూ తన జీవితంలో మహేష్ బాబు బాబాయ్ ఒక భాగం అయ్యారని చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగి, ఆయనకు వీరాభిమానిగా మారానని తెలిపారు. సినిమాలకు సంబంధించిన ఎన్నో సలహాలు, సూచనలు బాబాయ్ దగ్గర నుంచి తీసుకుంటానని, తను నాకు ఒక గైడ్ అంటూ తన బాబాయ్ గురించి కూడా జయకృష్ణ ఎంతో గొప్పగా మాట్లాడారు.

థాంక్యూ బాబాయ్..

Advertisement

ఇక తాను నటిస్తున్న శ్రీనివాసమంగాపురం సినిమా ఫస్ట్ లుక్ బాబాయ్ చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది థాంక్యూ బాబాయ్ అంటూ ఈ సందర్భంగా జయ కృష్ణ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా మొదటిసారి జయకృష్ణ ఒక పబ్లిక్ వేదికపై మాట్లాడుతూ తన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ నాయకులు శ్రీనివాస మంగాపురం చిత్ర నిర్మాత అశ్వినీ దత్ వంటి తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు పాల్గొని సందడి చేశారు. ఇక జయకృష్ణ సినిమా విషయానికి వస్తే అజయ్ భూపతి దర్శకత్వంలో ఈయన ఇండస్ట్రీ హీరోగా పరిచయం కాబోతున్నారు. లవ్ యాక్షన్ డ్రామగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో జయ కృష్ణకు జోడిగా రాషా తడాని హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.

Also Read: Actress nupur sanon: ప్రియుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×