E-Paper
Advertisement

అడివి శేష్ ‘డెకాయిట్’కి బాక్సాఫీస్ షాక్.. 5 రోజుల్లో ఇంత దారుణమైన వసూళ్లా?

అడివి శేష్ ‘డెకాయిట్’కి బాక్సాఫీస్  షాక్.. 5 రోజుల్లో ఇంత దారుణమైన వసూళ్లా?

Decoyt Movie :క్షణం,ఎవరు,గూడచారి,హిట్ 2అంటూ వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్న అడివి శేష్ ‘డెకాయిట్: ఎ లవ్ స్టోరీ’ అంటూ అనౌన్స్ చేయగానే క్యూరియస్ గా వాచ్ చేశారంతా. ఇక శృతి హసన్ ప్లేసులో సీతారామం బ్యూటీ మృణాల్ వచ్చి చేరడంతో భారీ అంచనాలే పెట్టుకున్నారు ఆడియన్స్. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ చూస్తుంటే ఆ అంచనాలు కాస్తా ఆవిరైనట్టే కనిపిస్తుంది.అవును..రిలీజై ఐదు రోజులు గడిచినా వరల్డ్ వైడ్ గా కనీసం 50 కోట్ల మార్కు టచ్ చేయలేకపోవడం మేకర్స్ కి పెద్ద షాకే.

అడివి శేష్ కెరీర్‌లోనే ఇదొక బిగ్ షాక్

నిజానికి వరుస సినిమాలతో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్న అడివి శేష్ ఈ సారి కూడా ఎదో మ్యాజిక్ చేస్తాడని బడ్జెట్ భారీగానే కుమ్మరించింది సుప్రియ అక్కినేని.కానీ పెట్టిన పెట్టుబడికి వస్తున్న కలెక్షన్స్ కి ఎక్కడా పొంతన లేని పరిస్థితి.ఇక ఐదో రోజు బాక్సాఫీస్ లెక్కలనే చూస్తె అడివి శేష్ కెరీర్‌లోనే ఇదొక బిగ్ షాక్ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా దాదాపు 4,250 షోలు స్క్రీనింగ్ అవుతున్నప్పటికీ , వసూళ్లలో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. ఐదో రోజు ఈ చిత్రం కేవలం 5 కోట్ల రూపాయల బిజినెస్‌తో సరిపెట్టుకుంది.ఇక ఇండియాలో ఇప్పటివరకు నెట్ వసూళ్లు 25.50 కోట్లు కాగా, గ్రాస్ పరంగా 29.69 కోట్లకు చేరుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొత్తం వసూళ్లు 41.69 కోట్ల వద్దే ఆగిపోయాయి. నిజానికి ఓవర్సీస్ మార్కెట్‌లో అడివి శేష్‌కు కాస్త పట్టు ఎక్కువ.కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ పట్టు తేలిపోయినట్టే కనిపించింది.అది ఎంతలా అంటే కేవలం 75 లక్షలు మాత్రమే వసూలు చేసేంతగా .ఇక భాషల వారీగా చూస్తే, ఐదో రోజు హిందీలో 75 లక్షలు, తెలుగులో 2.25 కోట్లు మాత్రమే రాబట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయ్.

పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం గగనం

వాస్తవానికి ఈ సినిమా డౌన్ ఫాల్ ఐదో రోజే కాదు, మొదటి సోమవారం నుంచే మొదలైంది. మొదటి రోజు 6.55 కోట్లతో పర్వాలేదనిపించేలా ఖాతా తెరిచిన డెకాయిట్, రెండో రోజు 6.85 కోట్లు, మూడో రోజు అంటే మొదటి ఆదివారం 6.40 కోట్ల బిజినెస్ చేసి పర్లేదు అనిపించింది. అయితే మొదటి సోమవారం రాగానే సినిమా కలెక్షన్స్ ఏకంగా 2.70 కోట్లకు పడిపోవడం ఒకరకంగా సినిమా ఫేట్‌ను డిసైడ్ చేసేసిందనే చెప్పాలి.75 కోట్ల భారీ బడ్జెట్‌తో, సుప్రియా యార్లగడ్డ మరియు సునీల్ నారంగ్ నిర్మించిన ఈ చిత్రానికి ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం గగనంగా మారిందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

బాక్సాఫీస్ వద్ద శేష్ నో మ్యాజిక్

అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కథనం పరుగులు పెట్టలేకపోవడం, మరో వైపు ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద దంచికోడుతుండటం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.ముఖ్యంగా ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ గట్టిగా ప్రమోషన్స్ చేసినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కాలేకపోయారు. చూస్తుంటే దు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద గాలి తీసేసిన ఈ ‘డెకాయిట్’, అడివి శేష్ ఖాతాలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేలానే ఉంది ఇక రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే, ఈ సినిమా కమర్షియల్‌గా భారీ నష్టాలను మిగిల్చడం ఖాయం. ఏది ఏమైనా బాక్సాఫీస్ వద్ద శేష్ మ్యాజిక్ ఈసారి అస్సలు వర్కౌట్ కాలేదని ఈ నంబర్లే సాలిడ్ ప్రూప్స్ గా మిగిలిపోతున్నాయ్. చూడాలి ఈసారి జరిగిన తప్పు వచ్చే సినిమాకి జరక్కుండా చూసుకుంటాడో లేదో !

also read:బాలీవుడ్ బండారం బయటపెట్టిన కోహ్లీ … అది హిట్టవ్వడం వాళ్లకు ఇష్టం లేదా?

Related News

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×