E-Paper
Advertisement

Rishabh Pant Injury: రూ.27 కోట్ల రిష‌బ్ పంత్ ను ఏడిపించిన‌ హేజిల్ వుడ్

Rishabh Pant Injury: రూ.27 కోట్ల రిష‌బ్ పంత్ ను ఏడిపించిన‌ హేజిల్ వుడ్
Advertisement

Rishabh Pant Injury:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament 2026) భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Royal Challengers Bengaluru vs Lucknow Super Giants) మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో… లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మాత్రం ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూప‌ర్ జెయింట్స్‌ కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant Injury) తీవ్రంగా గాయపడ్డాడు. హేజిల్ వుడ్ వేసిన ఓ బంతి నేరుగా రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. దీంతో విలవిలలాడిపోయిన రిష‌బ్ పంత్… గ్రౌండ్ విడాల్సి వచ్చింది. అతడు గ్రౌండ్ వీడుతూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దెబ్బ తగిలే సమయానికి మూడు బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్, ఒక్క పరుగు చేయకుండానే రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.

Also Read: Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

రిష‌బ్ పంత్ కు తీవ్ర గాయం.. క‌న్నీళ్లు పెట్టుకుంటూ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బిగ్ మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మోచేతికి తీవ్ర గాయం అయింది. దీంతో గ్రౌండ్ ను వీడిన రిషబ్ పంత్…LSG వికెట్లు పడ్డ నేపథ్యంలో తిరిగి బ్యాటింగ్ కు వచ్చాడు. అయినప్పటికీ పెద్ద ప్రయోజనం రాలేదు. తిరిగి బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్ ఒకే ఒక్క‌ పరుగుకు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో ఫాన్స్ నిరాశ చెందారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లకు కూడా గాయాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన 15 రోజుల తర్వాత సీనియర్ ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఇంజురీ బారిన పడ్డారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు పంత్ తరహాలోనే బంతి బలంగా తగిలింది. దీంతో 19 పరుగులు చేసిన తర్వాత బ్యాటింగ్ చేయలేక పెమిలియన్ వెళ్ళిపోయాడు. ఇక అతడు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడే అవకాశాలు లేనట్లు చెబుతున్నారు. ఇక విరాట్ కోహ్లీకి వైరల్ ఫీవర్ తో పాటు చీలమండ గాయం నెలకొన్నట్లు చెబుతున్నారు. అందుకే లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య చిన్న స్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా కోహ్లీ బ‌రిలోకి దిగనున్నాడు.

Advertisement

Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభ‌వ్ కు కూడా ల‌వ్ స్టోరీ…ఔట్ కాగానే క‌న్నీళ్లు పెట్టుకుంది క‌ద‌రా

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×