E-Paper
Advertisement

టాలీవుడ్ మల్టీప్లెక్స్‌లో ‘తమిళ’ దండయాత్ర! మన ‘డెకాయిట్’ కంటే ప్రదీప్ రంగనాథన్ సినిమాకే ఎక్కువ రేటా?

టాలీవుడ్ మల్టీప్లెక్స్‌లో ‘తమిళ’ దండయాత్ర! మన ‘డెకాయిట్’ కంటే ప్రదీప్ రంగనాథన్ సినిమాకే ఎక్కువ రేటా?
Advertisement

Ticket Price :

పక్కింటి పుల్ల కూర రుచి’ అన్న సామెత మరోసారి నిజమైనట్టే కనిపిస్తోంది. విషయంలోకి వెళితే అడవి శేష్ స్వయంగా స్క్రీన్‌ప్లే అందిస్తూ అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘డెకాయిట్’. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షనీల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ ఇది. మరోవైపు కోలీవుడ్ కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్,కృతి శెట్టి జంటగా ఎస్.జె.సూర్య కీ రోల్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా ‘LIK’ ( లవ్ ఇన్స్యూరెన్స్ కంపెని).సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై తెరకెక్కిన ఈ సినిమాని నయనతార ప్రొడ్యూస్ చేయడం విశేషం.

Advertisement

తెలుగు కన్నా తమిళ డబ్బింగ్ సినిమాకే 25 రూపాయలు ఎక్కువ

ఇక అడవి శేష్’డెకాయిట్’,ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సినిమాలు ఈ రోజు అంటే ఏప్రిల్ 10న ఒకేసారి థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లు భారీ బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పక్కా తెలుగు సినిమా ‘డెకాయిట్’ కోసం టికెట్ ధరను 225గా ఫిక్స్ చేస్తే, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై  తమిళ డబ్బింగ్ సినిమా ‘LIK’ కి మాత్రం ఏకంగా 250 వసూలు చేయడమే ఇక్కడ విశేషం.అంటే తెలుగు సినిమా కన్నా తమిళ డబ్బింగ్ సినిమాకే 25 రూపాయలు ఎక్కువన్న మాట.

Advertisement

పక్క రాష్ట్రం హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్?

దీంతో మన సొంత హీరోలకంటే పక్క రాష్ట్రం హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అసలు అడవి శేష్, మృణాల్ ఠాకూర్ వంటి క్రేజీ కాంబినేషన్ ఉన్న సినిమా కంటే, విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న డబ్బింగ్ సినిమాకు ఎక్కువ రేట్ పెట్టడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఎకిపారేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ రేట్ పెడితే అయినా మన సినిమాలు చూస్తారని ఇలా పెట్టి ఉంటారేమో అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఏది ఏమైనా ఒకేరోజు రిలీజ్ అయిన డెకాయిట్’,’LIK’  సినిమాల మధ్య టికెట్ రేట్ వార్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయింది.

తెలుగు మార్కెట్‌పై తమిళ తంబీల డామినేషన్?

ఇదిలా ఉంటే లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తుంటే ‘డెకాయిట్’సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 5 నుంచి 6 కోట్ల గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తుండగా, ‘LIK’ సినిమా కూడా యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ 2 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా అన్నపూర్ణ స్టూడియోస్ వంటి సంస్థలు ప్రేక్షకులకు భారం పడకూడదని తక్కువ రేట్లు పెడితే, తమిళ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ప్రదీప్ రంగనాథన్ ‘ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా తెలుగు మార్కెట్‌పై తమిళ తంబీల డామినేషన్ మామూలుగా లేదుగా అంటూ మూవీ లవర్స్ డిబేట్స్ మొదలుపెట్టేశారు. చూడాలి మరి మన హీరోలను పక్కన పెట్టేసి తమిళ తంబీలకు వేస్తున్న ఈ రెడ్ కార్పెట్ కల్చర్ ముందుముందు ఎటు వెళ్లబోతోందో!

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×