E-Paper
Advertisement

అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక ఫోన్లు.. తప్పుడు ప్రచారం చేస్తే జైలుకే, సీతక్క కీలక వ్యాఖ్యలు
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు అత్యాధునిక మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకతకు నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న విమర్శలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియ పూర్తి చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ పంపిణీలో పాల్గొనడం అభినందనీయమని పేర్కొంటూనే కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనల మేరకే టెండర్ల ప్రక్రియ

Advertisement

మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే జరిగిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జెమ్ (GeM) పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని తెలిపారు. ఇవి సీతక్క పిలిచిన టెండర్లు కావని.. థర్డ్ పార్టీ సంస్థ అయిన టీజీటీఎస్ (TGTS) ద్వారా నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో రెండుసార్లు టెండర్ల ప్రక్రియ చేపట్టామని ఆమె గుర్తు చేశారు. కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా రాజీ పడలేదని.. అంగన్‌వాడీలకు నాణ్యమైన పరికరాలు అందించడమే లక్ష్యమని చెప్పారు.

ధరలపై తప్పుడు ప్రచారం వద్దు

Advertisement

ఒక్కో మొబైల్ ఫోన్‌ను రూ. 14,999 కి కొనుగోలు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని మంత్రి ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఫోన్ గరిష్ట ధరను రూ. 11,800గా నిర్ణయించిందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంతకంటే తక్కువ ధరకే అంటే రూ. 11,650 కే వీటిని సేకరించిందని గణాంకాలను వివరించారు. ఐదేళ్ల కిందట బీఆర్ఎస్ హయాంలో పాత టెక్నాలజీ ఫోన్లను రూ. 10 వేలకు కొన్నారని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పటికీ అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్న ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నామని వెల్లడించారు. అంగన్‌వాడీ ఆడబిడ్డలకు అత్యాధునిక పరికరాలు ఇస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు.

కేసీఆర్ అదుపులో పెట్టుకోవాలి..

తప్పుడు ప్రచారం చేసే వారిని కేసీఆర్ అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే వారికే నష్టమని మంత్రి హెచ్చరించారు. ఆడబిడ్డలపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని లేదా కోర్టులకు వెళ్లాలని సవాల్ విసిరారు. సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఇసుక తవ్వకాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు లీగల్ నోటిసులు ఇవ్వడంతో అప్పటి ప్రభుత్వం విచారం వ్యక్తం చేసిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందని.. అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ నోటిసులు పంపుతామని మంత్రి స్పష్టం చేశారు.

ALSO READ: ఏపీ క్యాబినెట్‌లో మార్పులు ఖాయమా? సీఎం ‘క్లాస్’ వెనుక అసలు వ్యూహం ఇదే!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×