E-Paper
Advertisement

ఆ బోల్డ్ సీన్లను తొలగించండి ప్లీజ్.. ‘టాక్సిక్ ‘ టీమ్ కు కియారా రిక్వెస్ట్..!

ఆ బోల్డ్ సీన్లను తొలగించండి ప్లీజ్.. ‘టాక్సిక్ ‘ టీమ్ కు కియారా రిక్వెస్ట్..!
Advertisement

Toxic Movie : కన్నడ స్టార్, రాకింగ్స్ స్టార్ యష్   హీరోగా, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’.. కన్నడలో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉండడంతో సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామని యష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే జూన్ 4 ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ బోల్డ్ సీన్లు తొలగించాలంటూ టీమ్ కు రిక్వెస్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎందుకు అలా అడిగింది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. కాస్త వివరాల్లోకి వెళితే..

బోల్డ్ సీన్లు ట్రిమ్ చెయ్యండి ప్లీజ్..

ఈ టాక్సిక్ మూవీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. మార్చి నెలలో రిలీజ్ కావాల్సిన చిత్రం అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది.. ఇందులోని బోల్డ్ సీన్లు తొలగించాలని బాలీవుడ్ బ్యూటీ రిక్వెస్ట్ చెయ్యడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కథా అవసరాల రీత్యా యష్, కియారాల మధ్య కొన్ని బోల్డ్ సీన్లతో పాటుగా ఇంటిమేట్ సీన్లను చిత్రీకరించారు. అయితే షూటింగ్ సమయంలో కియారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పుడు ఫైనల్ కట్ చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురైందని సమాచారం.. స్క్రీన్‌పై ఆ సన్నివేశాలు చాలా ఇంటెన్స్‌గా ఉండటంతో తన ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందని అనుకుందేమో.. పెళ్లి తర్వాత ఇలాంటి సీన్లలో నటించడం ఎందుకని భావించిందో ఏంటో కానీ ఆ సినిమాలని తొలగించాలని, లేదంటే సీన్ల టైం తగ్గించాలి అంటూ రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆమె రిక్వెస్ట్ మేరకు ఈ సినిమాలోని కొన్ని సీన్లను తీసివేస్తారా? లేదంటే సీన్ టైమింగ్ తగ్గిస్తారా? అన్నది చూడాలి.. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Advertisement

Also Read :రామాయణ తర్వాత హీరో యష్ ఏ సినిమా చేయబోతున్నాడంటే..?

ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్..

ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని అటు యష్ ఫ్యాన్స్, ఇటు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీజర్ పై విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే.. బాగా బోల్డ్ సీన్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్స్ కూడా వినిపించాయి.. ఆ విమర్శలపై టాక్సిక్ టీం ఎక్కడ స్పందించలేదు.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘టాక్సిక్’ సినిమా జూన్ 4న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. దాంతో సినిమా మరోసారి వాయిదా పడిందని తెలుస్తుంది.. ఇప్పటికే రెండు సార్లు సినిమాను వాయిదా వేశారు. ఈ మూవీని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.. అంతర్జాతీయ స్థాయిలో సినిమా పై అంచనాలు క్రియేట్ చెయ్యడం, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌ను సమన్వయం చేసుకోవడం కోసమే సినిమాను వాయిదా వేసినట్లు హీరో యష్ ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Related News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

Big Stories

Advertisement
×