E-Paper
Advertisement

Devagudi: రాయలసీమ భావోద్వేగాలతో రానున్న దేవగుడి.. వీరారెడ్డి పాత్రలో కనిపించనున్న మ్యూజిక్ డైరెక్టర్..

Devagudi: రాయలసీమ భావోద్వేగాలతో రానున్న దేవగుడి.. వీరారెడ్డి పాత్రలో కనిపించనున్న మ్యూజిక్ డైరెక్టర్..

Devagudi: రాయలసీమ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇదే ఫార్మేట్ ఫాలో అవుతూ వస్తోంది దేవగుడి అనే సినిమా. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాతలు కొన్ని కీలక విషయాలు బయట పెట్టారు.

రాయలసీమ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా దేవగుడి.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందిందని దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి తెలిపారు. ప్రేమ, స్నేహం, కుటుంబ భావోద్వేగాలు ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించామని ఆయన చెప్పారు. అలాగే ఈ సినిమా నటుడిగా తనకు మంచి పేరు తీసుకువస్తుందని నమ్ముతున్నానని నటుడు..మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె అన్నారు.

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో.. బెల్లం రామకృష్ణ రెడ్డి రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె కీలక పాత్రల్లో నటించారు. సినిమా విడుదలను పురస్కరించుకుని నిర్వహించిన ఇంటర్వ్యూలో దర్శకుడు, నటుడు తమ అనుభవాలను పంచుకున్నారు.

దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, తాను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే భగవద్గీత ఆధారంగా ఒక కాన్సెప్ట్‌తో సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. భగవద్గీత కేవలం మత గ్రంథం కాదు, అది శాస్త్రీయంగా కూడా నిజమని ఐన్ స్టీన్, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు చెప్పారని గుర్తు చేశారు. ఆ ఆలోచనలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు “దేవగుడి” వరకు వచ్చిందని చెప్పారు. ఇది దర్శకుడిగా తన రెండో సినిమా అని తెలిపారు.

ఇండస్ట్రీలో కొత్తవాళ్లకు ఎదురయ్యే సమస్యలు తనకు బాగా తెలుసునని..అందుకే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీశామని చెప్పారు. తాను ఇంజినీర్ కావడంతో షూటింగ్ మొత్తం పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేశామని, అనుకున్న సమయానికే సినిమా పూర్తయ్యిందన్నారు. బడ్జెట్ కూడా చాలా కంట్రోల్‌లోనే ఉందని తెలిపారు.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా “ఆరో ఆరారో” పాటకు మంచి వ్యూస్ వస్తున్నాయని చెప్పారు. సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని తెలిపారు. కొద్దిగా వయలెన్స్, ఒక రొమాంటిక్ సాంగ్ కారణంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. ఓటీటీ, శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు.

ఈ సినిమా కథ స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాల చుట్టూ తిరుగుతుందని దర్శకుడు వివరించారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా అది కేవలం బ్యాక్‌డ్రాప్ మాత్రమేనని చెప్పారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన దూరం ఎందుకు వచ్చిందన్నదే కథ అని తెలిపారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించామని చెప్పారు.

నటుడు రఘు కుంచె మాట్లాడుతూ..ఈ సినిమాలో వీరారెడ్డి అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించానన్నారు. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడం కొత్త అనుభవమని చెప్పారు. షూటింగ్ మొత్తం రియల్ లొకేషన్స్‌లో జరగడం వల్ల పాత్రలోకి బాగా వెళ్లగలిగానన్నారు. దర్శకుడు బెల్లం రామకృష్ణ రెడ్డి ప్రతి సీన్‌ను చాలా క్లారిటీతో తీశారని ప్రశంసించారు.

తాను మొదట సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చానని, ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. నటుడిగా అవకాశాలు వచ్చినప్పుడు నిజాయితీగా నటిస్తున్నానని చెప్పారు. ఈ సినిమా తనకు నటుడిగా మంచి పేరు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తం పైన..దేవగుడి.. సినిమా భావోద్వేగాలు, కథ, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందని చిత్ర బృందం విశ్వాసంగా చెబుతోంది.

ALSO READ: Ustaad Bhagat Singh: జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ నుంచి మాస్ ట్రీట్ రెడీ..!

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×