E-Paper
Advertisement

Khairatabad Dog Attack: వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు.. ఖైరతాబాద్‌లో కలకలం

Khairatabad Dog Attack: వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు..  ఖైరతాబాద్‌లో కలకలం
Advertisement

Khairatabad Dog Attack: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల స్వైరవిహారం మరోసారి కలకలం రేపింది. ఖైరతాబాద్‌ పరిధిలో జరిగిన ఓ తాజా ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడటం నగరంలో కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన శార్వి అనే చిన్నారి స్థానిక పాఠశాలలో యూకేజీ (UKG) చదువుతోంది. ఎప్పటిలాగే తన ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో.. అక్కడే తిరుగుతున్న వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. చిన్నారి తప్పించుకునే లోపే కుక్కలు ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారి ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను అక్కడి నుంచి తరిమికొట్టారు.

Advertisement

తీవ్ర రక్తస్రావంతో ఉన్న శార్విని తక్షణమే బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖంపై లోతైన గాయాలు కావడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరవాసులు ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ.. వీధి కుక్కల నియంత్రణలో యంత్రాంగం విఫలమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.

Advertisement

ALSO READ: అయ్యో! ఎంత పని చేశావు చిన్నా.. ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడి..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×