E-Paper
Advertisement

దేవర 2 అటకెక్కినట్టేనా? కొరటాలకు ఎన్టీఆర్ హ్యాండ్.. నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!

దేవర 2 అటకెక్కినట్టేనా? కొరటాలకు ఎన్టీఆర్ హ్యాండ్.. నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!
Advertisement

Devara 2:దేవర 2… అసలు ఉంటుందా ఉండదా.. గత కొన్ని రోజులుగా తారక్ ఫ్యాన్స్ ని పట్టి పీడిస్తున్న ప్రశ్న ఇది. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత వచ్చిన దేవర ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టడం, పైగా సినిమా అసలైన కథ పార్ట్-2లోనే ఉందని డైరెక్టర్ కొరటాల శివ ఊరించడంతో సీక్వెల్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారంతా.కానీ, సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు సీక్వెల్‌పై కనీస అప్‌డేట్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం దేవర-2 ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళడం కష్టమే అని, చూస్తుంటే సినిమా దాదాపు అటకెక్కినట్టే అంటూ విశ్లేషిస్తున్నారు ట్రేడ్ పండితులు.

2027 జూన్ 11న రిలీజ్

Advertisement

దీనికి అసలైన కారంణం… నీల్ ప్రాజెక్ట్ విషయంలో తారక్ తీసుకున్న నిర్ణయమే. అవును.. నీల్ – తారక్ కాంబో మూవీని 2027 జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం దేవర సీక్వెల్‌కు పెద్ద అడ్డంకిలా మారినట్టే కనిపిస్తుంది. తాజాగా నీల్ – తారక్ కాంబోలో రానున్న సినిమాని 2027 జూన్ 11న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.అంటే, రాబోయే ఏడాదిన్నర పాటు తారక్ పూర్తి కాల్ షీట్స్ ఆ ప్రాజెక్టుకే కేటాయించేశారన్న మాట.

దేవర 2 పై ఆశలు పెట్టుకోకుండా

Advertisement

నిజానికి ఈ ఏడాదే దేవర-2 షూటింగ్ మొదలవ్వాల్సి ఉంది. కానీ, ఎన్టీఆర్ తన పాన్ ఇండియా ఇమేజ్‌ను మరింత పెంచుకునే క్రమంలో కొరటాల ప్రాజెక్ట్‌ను కాదని ప్రశాంత్ నీల్ వెనుక వెళ్ళాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయ్.దీంతో కొరటాల శివకి ఇక దేవర 2 పై ఆశలు పెట్టుకోకుండా మరో హీరో కోసం వెతికే పనిలో పడ్డాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఇందులో భాగంగానే నందమూరి నటసింహం బాలకృష్ణకు ఒక పవర్ ఫుల్ స్టోరీ వినిపించాడట కొరటాల. ఇక ఆ స్టోరీ లైన్ బాలయ్యకి బాగా నచ్చడంతో త్వరలో ఈ క్రేజీ కాంబో అనౌన్స్ మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదట. అయితే ఒకేసారి అరడజన్ డైరెక్టర్స్ క్యూ లో ఉండగా బాలయ్య వీళ్ళందరికీ డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తాడన్నదే అసలు ప్రశ్న.

‘గాడ్ ఆఫ్ వార్’ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్

ఇక అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న మే 20 (తారక్ బర్త్ డే) రోజున కూడా దేవర-2 అప్‌డేట్ వచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఆ రోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే సూచానలు కనిపిస్తుండటంతో కొరటాల దేవర 2 అప్ డేట్ పై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదన్న డిస్కషన్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా జరుగుతుంది.

సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ 

వినిపిస్తున్నట్టుగా దేవర 2 అప్ డేట్ రాకపోతే మాత్రం తారక్ ఈ సినిమాకి ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నాడో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక నీల్ సినిమా, త్రివిక్రమ్ సినిమాలతో తారక్ డైరీ మరో రెండేళ్ళు అంటే ఫుల్ అయ్యేలా కనిపిస్తుంది. ఏది ఏమైనా సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చి తారక్ ఇలా మరో దర్శకుల వైపు దిక్కులు చూడటం కాస్త రిస్క్ అనే చెప్పాలి. చూడాలి మే 20 న తారక్ ఎలాంటి సెన్సేషన్ న్యూస్ రివీల్ చేస్తాడో!

also read:వరుస ఫ్లాపులు.. అమ్ముడుపోని ఓటీటీ రైట్స్! పూరీ జగన్నాథ్ పతనం మొదలైందా?

Related News

జిమ్ వర్కౌట్స్ తో ఆశ్చర్యపరుస్తున్న స్టార్ హీరో తల్లి.. ఎవరంటే?

ప్రదీప్ రావత్ జీవితంలో భయంకరమైన రోజు అదే!

తేజెస్వి మదివాడ రియల్ స్టోరీ.. కన్నీళ్లు తెప్పించే ట్విస్టులు..

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

Big Stories

Advertisement
×