E-Paper
Advertisement

వరుస ఫ్లాపులు.. అమ్ముడుపోని ఓటీటీ రైట్స్! పూరీ జగన్నాథ్ పతనం మొదలైందా?

వరుస ఫ్లాపులు.. అమ్ముడుపోని ఓటీటీ రైట్స్! పూరీ జగన్నాథ్ పతనం మొదలైందా?
Advertisement

Puri Jagannadh:పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు ఈయన చేతిలో పెన్ అనే గన్ నుండి వచ్చిన మాటల తూటాలు బాక్సాఫీస్ ని ఏ రకంగా చీల్చి చెండాడేవో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అలాంటి పూరి నుండి జస్ట్ సినిమా అనౌన్స్ అయితే చాలు.. షూటింగ్ మొదలవ్వకముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేవి. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. విజయ్ సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్ తోడున్నా, టబు లాంటి సీనియర్ స్టార్ ఉన్నా.. ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ సినిమాకు ఓటీటీ బయ్యర్లు ముఖం చాటేస్తుండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయిపోయింది.

‘లైగర్’ ఒక  చేదు జ్ఞాపకం!

Advertisement

పూరీ మార్కెట్‌ను దారుణంగా దెబ్బతీసింది ‘లైగర్’. కేవలం సినిమా డిజాస్టర్ అవ్వడమే కాదు, ఆ తర్వాత జరిగిన డిస్ట్రిబ్యూటర్ల గొడవలు పూరీ బ్రాండ్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేశాయి. ఇక డబుల్ ఇస్మార్ట్ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఇప్పుడు ఓటీటీ సంస్థలు “కంటెంట్ చూశాకే.. రేటు చెబుతాం” అంటూ కండిషన్స్ పెడుతున్నాయట. అంటే పూరి సినిమాలకి కూడా ముందుగానే అగ్రిమెంట్లు చేసుకునే కాలం చెల్లిపోయిందన్న మాట.

also read:వేదికపైనే వెక్కి వెక్కి ఏడ్చిన జెనీలియా.. ఎందుకో తెలుసా?

Advertisement

బిచ్చగాడిగా  ప్రయోగం.. రిస్క్ లో పడ్డారా?

నిజానికి గ్లామర్, గన్స్, గ్యాంగ్‌స్టర్స్.. ఇవే పూరీ జగన్నాథ్ బలం. కానీ ఈసారి అందుకు భిన్నంగా స్లమ్ ఏరియా బ్యాక్‌డ్రాప్, బిచ్చగాడి పాత్ర (విజయ్ సేతుపతి) చుట్టూ కథను తిప్పారని ఇన్ సైడ్ టాక్. ఇక సినిమాని మే 2026 నాటికి రెడీ చేయాలనే టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారట. కానీ పూరీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ ‘రా అండ్ రస్టిక్’ జోనర్‌లో వర్కవుట్ అవుతాయా లేదా? అనే డౌట్స్ బయ్యర్లలో బలంగా ఉందన్న టాక్ వినిపిస్తుంది.

రిస్క్ చేయలేం అంటున్న  స్ట్రీమింగ్ దిగ్గజాలు!

ఇక ఎల్లకేళ్ళు సినిమా షూటింగులు జరుపుకుంటున్న ఈ రోజుల్లో స్లమ్‌డాగ్ ని కేవలం 5 నెలల్లో కంప్లీట్ చేశాడంటే పూరిని మెచ్చుకోవాల్సిందే. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారా అన్న అనుమానాలు కూడా మార్కెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 10న విడుదలైన పెద్ద సినిమాల ఫలితాలను చూసిన తర్వాత, బయ్యర్లు మరింత జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. మరో వైపు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి సంస్థలు కేవలం స్టార్ డమ్ చూసి కోట్లు కుమ్మరించడం లేదు. కంటెంట్ నచ్చితే తప్ప అడుగు ముందుకు వేయని పరిస్థితి.

 ‘డూ ఆర్ డై’ గేమ్ ఆడుతున్న పూరీ

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన పూరీ జగన్నాథ్ కెరీర్ ప్రస్తుతం డూ ఆర్ డై అన్నట్టుగానే ఉంది. చూడాలి బాక్సాఫీస్ వద్ద స్లమ్‌డాగ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో. ఏది ఏమైనా త్వరలో రాబోతున్న ‘స్లమ్‌డాగ్’ టీజర్ తోనే అసలు విషయం తేలిపోతుంది. పడిపోయిన ప్రతీ సారి పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఇది ఇండస్ట్రీలో పాతుకుపోయిన నానుడి. చూడాలి దాన్ని ఎలా నిజం చేస్తాడో!

also read:అప్పుడేమో పవన్.. ఇప్పుడేమో బెల్లంకొండ! ‘తొలిప్రేమ’ డైరెక్టర్ గ్రాండ్ రీ-ఎంట్రీ..

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×