E-Paper
Advertisement

Dhurandhar 2: ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిన ధురంధర్ 2.. ఇక అందరూ ఇది ఫాలో అవ్వనున్నారా..!

Dhurandhar 2: ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిన ధురంధర్ 2.. ఇక అందరూ ఇది ఫాలో అవ్వనున్నారా..!
Advertisement

Dhurandhar 2:టాలీవుడ్, బాలీవుడ్‌లో చాలా కాలంగా ఒక నమ్మకం ఉంది ..సినిమా చిన్నదిగా ఉంటేనే హిట్ అవుతుందని. కానీ ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపించింది ధురంధర్ 2. దాదాపు 4 గంటల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 800 కోట్ల భారీ కలెక్షన్లు సాధించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ప్రేక్షకులు ఎక్కువ సేపు కూర్చునే సినిమాలను ఇష్టపడరని అనుకుంటారు. అందుకే చాలా దర్శకులు సినిమాను చిన్నగా, ఫాస్ట్‌గా తీసే ప్రయత్నం చేస్తారు. కానీ ధురంధర్ 2 మాత్రం ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసింది. ఈ సినిమా చూడటానికి సమయం, ఓపిక అవసరం ఉన్నా, ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తున్నారు.

కథ బాగుంటే చాలు..!

Advertisement

ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది ..కథ బాగుంటే సినిమా లెంగ్త్ పెద్ద సమస్య కాదు. ప్రేక్షకులు బోర్ కాకుండా సినిమా మొత్తాన్ని ఆసక్తిగా చూపించడమే ముఖ్యం అని ఈ సినిమా రుజువు చేసింది.

ఈ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. కథను భాగాలుగా చూపిస్తూ, ప్రతి భాగంలో ట్విస్టులు, ఎమోషన్స్, క్లైమాక్స్‌లను జోడించాడు. ఇది ఒక వెబ్ సిరీస్‌లా అనిపించేలా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు సినిమా అంతా ఎంగేజ్ అవుతూ వస్తారు.

Advertisement

ఇక్కడ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ముఖ్య పాత్ర పోషించాయి. ఇప్పుడు ప్రేక్షకులు లాంగ్ కంటెంట్ చూడటానికి అలవాటు పడిపోయారు. వెబ్ సిరీస్‌లు, ఎపిసోడ్‌ల రూపంలో పెద్ద కథలను ఆస్వాదిస్తున్నారు. అందుకే ఇప్పుడు థియేటర్లలో కూడా అలాంటి సినిమాలను అంగీకరిస్తున్నారు.

ఇంకా ఒక ముఖ్య విషయం ఏమిటంటే .. తక్కువ లెంగ్త్ ఉన్న సినిమా అయినా కథ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. కానీ మంచి కథ ఉంటే ఎంత పొడవైన సినిమా అయినా ఆసక్తిగా చూస్తారు. ధురంధర్ 2 ఈ విషయాన్ని బలంగా నిరూపించింది.

ALSO  READ: Oka Roju movie Trailer: సాయి పల్లవి జునైద్ ‘ఒకరోజు’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

Related News

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

యశ్ ఎదుగుదల చూసి ఏడుస్తున్నారు… ట్రోల్స్ పై సుమలత ఫైర్!

Big Stories

Advertisement
×