E-Paper
Advertisement

Oka Roju movie Trailer: సాయి పల్లవి జునైద్ ‘ఒకరోజు’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

Oka Roju movie Trailer: సాయి పల్లవి జునైద్ ‘ఒకరోజు’  తెలుగు ట్రైలర్ రిలీజ్..
Advertisement

Oka Roju movie Trailer: సాయి పల్లవి ప్రస్తుతం సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ (junaid khan)హీరోగా పరిచయమవుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఏక్ దిన్. ఈ సినిమా హిందీ తో పాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ప్రేమ కథ చిత్రంగా ఒకరోజు..

గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి హిందీ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో ఒకరోజు (Oka Roju)అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్రైలర్ మొదట్లోనే ప్రేమలో ఓడిపోయిన వారందరూ ఇక్కడికి వచ్చి ఈ గంట కొడితే వారి ప్రేమ సక్సెస్ అవుతుంది అంటారనే డైలాగులు వింటుంటే ఈ సినిమా ఒక ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇందులో సాయి పల్లవి మీరా అనే పాత్రలో కనిపించనున్నారు.

ఒకరోజు సినిమా ట్రైలర్..

Advertisement

నేను కోరుకున్నది నా కళ్ళ ముందే ఉంది అంటూ వచ్చే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇలా ఒక ప్రేమ కథ సినిమాగా ఒక రోజు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహించగా అమీర్ ఖాన్ నిర్మాణంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సాయి పల్లవికి మొదటి హిందీ సినిమా కావటం విశేషం అలాగే జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతూ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మే ఒకటవ తేదీ తెలుగు హిందీ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. మరి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు ఎలాంటి సక్సెస్ వస్తుందో తెలియాల్సి ఉంది. ఇంకా సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత ఈమె తమిళంలో ధనుష్ 55 వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఇక తెలుగులో కూడా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2 సినిమాలు సుమతి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువలేదు. అలాగే నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో కూడా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమా కూడా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సాయి పల్లవి ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Dhurandhar 3: ధురంధర్ 3 పై రూమర్ల పై క్లారిటీ.. ఉన్నట్టా? లేనట్టా?

Related News

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

Big Stories

Advertisement
×