Dhurandhar 2:ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya dhar) దర్శకత్వంలో రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ మూవీ ధురంధర్ ..ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై పడింది. ధురంధర్ 2 : ది రివేంజ్ పేరిట వస్తున్న ఈ సినిమా మార్చి 19వ తేదీన గురువారం రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అటు ఈ చిత్రానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతోందని చెప్పాలి… మార్చి 19 తెల్లవారుజామున 2:00 గంటల నుండి ఎర్లీ మార్నింగ్ షోలను కూడా ప్రారంభించనున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్ సంఖ్యలు సినీ ప్రేక్షకులలో పెరుగుతున్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 : ది రివేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది.. విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తోంది. ఒక సోమవారం రోజు ఈ సినిమాకు 12.5 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా భారత్, విదేశాలలో కలిపి ఇప్పటికే సుమారుగా రూ.130 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి . కేవలం పెయిడ్ ప్రివ్యూస్ ద్వారానే సుమారుగా రూ.35 కోట్లు రాబట్టి గత రికార్డులను చెరిపివేసింది ఈ చిత్రం. ఏది ఏమైనా విడుదలకు ముందే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే అడ్వాన్స్ బుకింగ్ లో జోరు చూపిస్తున్న ధురంధర్ 2 : ది రివేంజ్ మార్చి 19వ తేదీన ఇప్పటివరకు ఉన్న రికార్డులను ఏ విధంగా చెరిపి వేస్తుందో చూడాలి. ఇకపోతే అడ్వాన్స్ బుకింగ్ లో భాగంగా సోమవారం రోజు 1.74 లక్షల టికెట్లను అమ్ముకుంది. కేవలం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దేశీయ బాక్సాఫీస్ వసూళ్లకు 7 కోట్లను జోడించింది. ఇక సుమారుగా మొదటి రోజు 29.04 కోట్ల కలెక్షన్స్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే లభించాయి.
ALSO READ:Ustaad Bhagat Singh: పాపం శ్రీలీల కష్టాలు మామూలుగా లేవే.. కనీసం ఇప్పటికైనా?
ఇదిలా ఉండదా మరొకవైపు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన 2023 నాటి ఫ్యామిలీ క్రైమ్ డ్రామా యానిమల్ అడ్వాన్స్ బుకింగ్ ని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తోంది.. యానిమల్ సినిమా తొలి రోజు అడ్వాన్స్ అమ్మకాల ద్వారా 29.25 కోట్లు వసూలు చేసింది. ఒకవేళ దురంధర్ 2 దీనిని అధిగమించితే మాత్రం భారతదేశంలో తొలిరోజు అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన టాప్ 5 హిందీ చిత్రాల జాబితాలోకి ప్రవేశిస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే దురంధర్ 2 సినిమాకి ఒరిజినల్ హిందీ వర్షన్ బాగా దోహద పడింది. 19.27 కోట్లు కేవలం హిందీ వర్షన్ ద్వారానే లభించాయి. ఇక తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా తెలుగు వెర్షన్ 40.56 లక్షలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా లభించింది.. మరి ఇంత గట్టి పోటీ మధ్య కూడా దురంధర 2 రికార్డులు సృష్టిస్తోంది అనడంలో సందేహం లేదు.