E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: పాపం శ్రీలీల కష్టాలు మామూలుగా లేవే.. కనీసం ఇప్పటికైనా?

Ustaad Bhagat Singh: పాపం శ్రీలీల కష్టాలు మామూలుగా లేవే.. కనీసం ఇప్పటికైనా?
Advertisement

Ustaad Bhagat Singh:యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela ) ఈ మధ్యకాలంలో వరుసగా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ జోరు పెంచేసింది.. ముఖ్యంగా హరీష్ శంకర్( Harish Shankar)దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా హరీష్ శంకర్ మాత్రమే సింగల్ గా ప్రమోషన్స్ చేపడుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయనకు తోడుగా శ్రీ లీల కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అయితే తాజాగా ఆమె వినూత్న పద్ధతిలో చేసిన ప్రమోషన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ , నెటిజన్స్ శ్రీ లీలా కష్టం మామూలుగా లేదే అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

వినూత్నంగా శ్రీ లీలా ప్రమోషన్స్..

ఇటీవల సినిమా నుండి విడుదలైన ట్రైలర్ లో వచ్చిన డైలాగు అందరి దృష్టిని ఆకట్టుకుంది. “ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం” అనే డైలాగు భారీగా పాపులర్ అయిపోయింది . ఇప్పుడు ఇదే డైలాగ్ ను “శ్రీలీల ఇచ్చిపడేసే గోత్రం ..ఇరగదీసే నక్షత్రం” అని రాసి ఉన్న టీ షర్టును ధరించి మరీ ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వినూత్నంగా సినిమా ప్రమోషన్స్ చేపట్టింది. అయితే ఇది చూసిన నెటిజన్స మాత్రం సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శ్రీ లీల ఈ సినిమా సక్సెస్ అందుకోవడానికి ఈ విధంగా వినూత్న పద్ధతిలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది. పాపం ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత ప్రయత్నాలు చేస్తూ ప్రమోషన్స్ మొదలుపెట్టిన శ్రీ లీల ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

ALSO READ:Sridevi: చివరికి మద్రాస్ హైకోర్టుకు చేరిన శ్రీదేవి ఆస్తి వివాదం.. న్యాయం ఎవరి వైపు?

ఈ సినిమా అయినా ఆమెను కాపాడుతుందా?

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది . మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఒక భారీ అంచనాల మధ్య మార్చి 26న రావాల్సిన ఈ సినిమా అభిమానుల కోసం వారం ముందుగానే మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలే సక్సెస్ కోసం ఆరాటపడుతున్న శ్రీ లీల.. టాలీవుడ్లో మళ్లీ పాగా వేయాలని చూస్తున్న హీరోయిన్ రాశి ఖన్నా కి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఇకపోతే శ్రీ లీల ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది. అటు కోలీవుడ్లో అడుగుపెట్టినా అక్కడ కూడా సరైన సక్సెస్ లభించలేదు. పవన్ కళ్యాణ్ సినిమా నైనా శ్రీ లీలకి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Related News

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×