E-Paper
Advertisement

Dhurandhar 2: ధురంధర్ నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతంటే?

Dhurandhar 2: ధురంధర్ నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతంటే?

Dhurandhar 2:ధురంధర్.. హిందీ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్న ధురంధర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ (Adityadhar) దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. అటు పాకిస్తాన్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా ధురంధర్: ది రివేంజ్ పేరిట ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు 145 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.

నటీనటుల రెమ్యూనరేషన్..

ఇదిలా ఉండగా ఒకవైపు ఈ రెండు పార్టులకు కలిపి సుమారుగా రూ.450 కోట్లు బడ్జెట్ అయినట్టు అటు జాతీయ మీడియా కూడా తెలిపింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చి పడుతున్న ఈ నేపథ్యంలోనే ఇందులో నటిస్తున్న నటీనటులకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎవరికి ఎంత రెమ్యూనరేషన్? వీరిలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి ఆయువు పట్టు అయిన హీరో రణ్‌వీర్ సింగ్ సుమారుగా 50 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే సంజయ్ దత్ 10 కోట్లు, ఆర్.మాధవన్ 9 కోట్లు, అక్షయ్ కన్నా 2.5 కోట్లు, అర్జున్ రాంపాల్ కోటి, సారా అర్జున్ కోటి రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఇకపోతే మొదటి భాగం 1350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయగా.. రెండవ పార్ట్ అంతకంటే ఎక్కువే రాబట్టడం పక్కా అని అటు నెటిజన్లు కూడా చెబుతున్నారు.

also read:Vishwambhara Movie: చిరంజీవి విశ్వంభర మూవీ థియేట్రికల్ రైట్స్ వారి చేతికే!

ధురంధర్: ది రివేంజ్ కలెక్షన్స్..

మార్చి 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మార్చి 18వ తేదీన పెయిడ్ రివ్యూ లతో ప్రారంభమైంది. ఇండియాలోనే 43 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రివ్యూల ద్వారానే 75 కోట్ల స్థూల వసూలు రాబట్టింది. ఇంకా మొదటి రోజే ఈ చిత్రం భారత దేశంలో 102.55కోట్ల నికర వసూళ్లతో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అటు ప్రివ్యూ లతో కలిపి కేవలం మొదటి రోజే మొత్తం రూ.145.55 కోట్లు లభించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 165 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2 రోజుల్లోనే 240 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×