E-Paper
Advertisement

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!

Congress Party: కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్‌గా హైకమాండ్ ప్లాన్!
Advertisement

Congress Party: స్వేచ్ఛ, బ్యూరో:  కాంగ్రెస్ పార్టీలోని పదవులు ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు పదవులు ప్రాసెస్‌ స్పీడప్ అయింది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవులను కూడా ఈ సారి ప్రకటించాలని ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగానే తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్..ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. ఫ్రంటల్ వింగ్ ఆర్గనైజేషన్స్ లో ఎవరిని నియమించాలి? ప్రభుత్వ నామినేటెడ్ పదవులకు ఎవరిని సిఫారసు చేయాలి? వంటి అంశాలపై ఏఐసీసీ ఇన్ చార్జ్ స్టడీ చేస్తున్నారు.ఎమ్మెల్యేలు, డీసీసీల నుంచి సేకరించిన లిస్టుపై ఆమె అధ్యయనం చేస్తున్నారు.

కమిట్మెంట్ తో పనిచేస్తారా?

ఆయా లీడర్లు పార్టీలో ఎప్పట్నుంచి పనిచేస్తున్నారు? పార్టీ, ప్రభుత్వంపై నిబద్ధత ఎలా ఉన్నది? కమిట్మెంట్ తో పనిచేస్తారా? లేదా? పార్టీ పవర్ లోకి రావడంతో ఆయా లీడర్లు ఏ విధంగా ఉపయోగపడ్డారు? పబ్లిక్ లో ఆ లీడర్లకు ఎలాంటి స్పందన ఉన్నది? అనే తదితర అంశాలను క్షేత్రస్థాయి నుంచి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. హైకమాండ్ కు చేరిన లిస్టుల్లో నుంచి మూడు విధానాల్లో పేర్లను ఫిల్టర్ చేయనున్నారు. పార్టీలో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న లీడర్లు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చేరిన లీడర్లు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలోకి వచ్చిన లీడర్లు..ఇలా మూడు కేటగిరీలుగా విభజించి షార్ట్ లిస్టు తయారు చేయనున్నారు.

Advertisement

Also ReadRanga Reddy News: సర్పంన్పల్లి ప్రాజెక్టు నీటితో అక్రమంగా కోట్ల వ్యాపారం.. ప్రమాదాలు జరిగిన పట్టించుకోని అధికారులు

క్షేత్రస్థాయి లో బలంగా ఉండాల్సిందే

ప్రభుత్వ పనితీరు అద్భుతంగా నిర్వహించినా..క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం సరిగ్గా లేకపోతే సర్కార్ కు చిక్కులు తప్పవు. దీంతో నే పదవులను వేగంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడుస్తుంది. క్షేత్రస్థాయి లీడర్లు కూడా చాలా ఓపికగా పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రకటించకపోతే, పార్టీకి నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నదని ఏఐసీసీ గుర్తించింది. ఈ నేపథ్​యంలోనే తాజాగా సీఎం, పీసీసీ చీఫ్​, ఏఐసీసీ ఇన్ చార్జ్ తోనే అగ్రనాయకత్వం ప్రత్యేకంగా మాట్లాడింది. దీనిలో భాగంగానే ప్రభుత్వం, పార్టీ లోని పదవులను ఏప్రిల్ నెల చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు. స్టేట్ నుంచి జిల్లా స్థాయి వరకు ఖాళీగా ఉన్న పదవులన్నీ భర్త చేయనున్నారు. ప్రధానంగా పార్టీ లోని చైర్మన్లు, ప్రభుత్వంలోని కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు తదితర పదవులన్నీ ఈ సారి భర్తీచేయనున్నారు. ఇక పార్టీలోని డీసీసీ పరిధిలో మిగిలిన జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ట్రెజరర్ లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వంటి పదవులను కూడా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతుంది.

సామాజిక సమీకరణాలను పరిశీలిస్తూనే

Advertisement

పదవుల భర్తీలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ నేతృత్వంలో ఇప్పటికే కసరత్తు ముమ్మరమైంది. కేవలం పైస్థాయి రికమండేషన్లకే పరిమితం కాకుండా, గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ కోసం ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల నుంచి ప్రతిపాదనలు సేకరించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీని నమ్ముకున్న వారు, గత ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు ఈసారి పెద్దపీట వేయనున్నారు.దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు పక్కాగా పదవులు దక్కేలా ఏఐసీసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం జాబితా రెడీ అయిందని, మరో 30 శాతం పేర్లు ఫైనల్ కాగానే ప్రకటిస్తామని ప్రభుత్వంలోని ఓ సీనియర్ నేత తెలిపారు. గ్రామ స్థాయి నుంచి గాంధీభవన్ వరకు మండల స్థాయి నుంచి ముఖ్యమైన శాఖల వరకు నామినేటెడ్ పదవులను కూడా ఈ దఫా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

Also Read: Sudheer Babu Gully: సుధీర్ బాబు ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఆ స్టార్ హీరో, హీరోయిన్‌తో ఆకట్టుకున్న టీజర్!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×