E-Paper
Advertisement

Dhurandhar 2: మన తెలుగు సినిమా రికార్డ్ టచ్ చేయలేకపోయినా దురంధర్ 2

Dhurandhar 2: మన తెలుగు సినిమా రికార్డ్ టచ్ చేయలేకపోయినా దురంధర్ 2
Advertisement

Dhurandhar 2:దేశవ్యాప్తంగా ఇప్పుడు దురంధర్ 2 మానియా కనిపిస్తోంది. మార్చ్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగం సక్సెస్ వల్ల ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. రిలీజ్ అయ్యిన వెంటనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనంగా నిలిచింది.

ప్రీ బుకింగ్స్ నుంచే దురంధర్ 2 కొత్త రికార్డులు సృష్టించింది. టికెట్ సేల్స్, ప్రీమియర్ షోలు అన్నింటిలోనూ మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ భావించారు.

ఆ రికార్డులు అన్నీ అవుట్..!

Advertisement

రిలీజ్ రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 236 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ నెంబర్ చాలా పెద్దది. ఈ కలెక్షన్స్‌తో దురంధర్ 2 ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా బాహుబలి 2 డే వన్ రికార్డ్ (సుమారు 217 కోట్లు) ను ఈ సినిమా దాటేసింది. అలాగే ఆర్ఆర్ఆర్ డే వన్ కలెక్షన్స్ (సుమారు 223 కోట్లు) ను కూడా క్రాస్ చేసింది.

ఈ రికార్డ్ మాత్రం సేఫ్..!

అయితే ఈ భారీ వసూళ్లు వచ్చినప్పటికీ, ఒక రికార్డ్ మాత్రం దురంధర్ 2 అందుకోలేకపోయింది. అదే పుష్ప 2 డే వన్ రికార్డ్. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో నార్త్ మార్కెట్‌లో భారీ హైప్ ఏర్పడింది. ఆ క్రేజ్ కారణంగా ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 294 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Advertisement

దురంధర్ 2 మంచి వసూళ్లు సాధించినప్పటికీ, పుష్ప 2 రికార్డ్‌కు దగ్గరగా కూడా రాలేకపోయింది. దీంతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సౌత్ సినిమాల డామినేషన్ స్పష్టంగా కనిపించింది అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

దురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కానీ పుష్ప 2 సెట్ చేసిన భారీ రికార్డ్‌ను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. ఇక ముందు రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

ALSO READ: Raashi Khanna: ఆ సీన్ సమయంలో గొడవ.. మధ్యలో వెళ్లిపోదామనుకున్నాను.. రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×