E-Paper
Advertisement

Baleno vs Glanza: ఒకే ప్లాట్‌ ఫామ్, రెండు బ్రాండ్లు.. బాలెనో vs గ్లాంజా, రెండింటిలో ఏది బెస్ట్?

Baleno vs Glanza: ఒకే ప్లాట్‌ ఫామ్, రెండు బ్రాండ్లు.. బాలెనో vs గ్లాంజా, రెండింటిలో ఏది బెస్ట్?
Advertisement

Baleno vs Glanza Comparison: మారుతి సుజుకి బాలెనో,  టయోటా గ్లాంజా కార్లు మెకానికల్‌ గా ఒకే మాదిరిగా ఉంటాయి. ఫీచర్లు, పని తీరును కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అయితే, ఈ రెండు కార్ల మధ్య కీలక తేడాలు, ధర సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బాలెనో vs గ్లాంజా మధ్య కీలక తేడాలు

మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా ఇంజన్లు, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. కానీ, ధరలు, ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ఎందుకంటే, ఈ కార్లు ప్రాథమికంగా ఒకే రకంగా ఉంటాయి. ఈ రెండు కార్లు ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ విభాగంలో ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు ధర, ఫీచర్లు, బెనిఫిట్స్ పరంగా ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవాలి.

ధర, వేరియంట్ మధ్య తేడాలు  

Advertisement

బాలెనో హ్యాచ్‌ బ్యాక్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.10 లక్షల వరకు ఉంటుంది.  టయోటా గ్లాంజా ధర రూ. 6.46 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 9.44 లక్షల వరకు ఉంటుంది.  గ్లాంజా కంటే బాలెనో ధర కొద్దిగా తక్కువగా ఉంది.  వేరియంట్ల విషయానికి వస్తే, పెద్దగా తేడా లేదు. ఈ కార్లు ఒకే రకమైన వేరియంట్లను కలిగి ఉన్నాయి.

ఇంజిన్, పనితీరు

రెండు కార్లలోనూ ఒకే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇవి వరుసగా 88.50 hp పవర్, 113 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. గేర్‌ బాక్స్ ఎంపికల్లో 5 స్పీడ్ మాన్యువల్, AMT ఉంటాయి. రెండు మోడళ్లు CNG ఆప్షన్లలో కూడా వస్తాయి. మైలేజ్ పరంగా, రెండు కార్లు ఒకే నిర్మాణాన్ని కలిగి ఉన్నందున మైలేజ్ కూడా ఒకేలా ఉంటాయి. పెట్రోల్ వేరియంట్లు MT కోసం 22.35 kmpl, AT కోసం 22.94 kmpl మైలేజీని  ఇస్తాయి. CNG వెర్షన్లు 30.61 km/kg మైలేజీని అందిస్తాయి. రెండు కార్ల పనితీరు ఒకేలా ఉంటుంది.

ఫీచర్లు, టెక్నాలజీ, సేఫ్టీ

Advertisement

బాలెనో, గ్లాంజా కూడా దాదాపు ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. వీటిలో టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లేతో పాటు కనెక్టెడ్ కార్ టెక్ ఉన్నాయి. ఇంటీరియర్ లేఅవుట్, మెటీరియల్స్   స్పేస్ కూడా ఒకేలా ఉంటాయి. బ్యాడ్జ్ ప్లేస్‌ మెంట్, కలర్ ఆప్షన్స్ లాంటి చిన్న కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. రెండు మోడళ్లు 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఇతర ప్రామాణిక భద్రతా ఫీచర్లతో వస్తుంది.

Read Also:  6 ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!

రెండు కార్లలో ఏది కొంటే మంచిది?

తక్కువ కొనుగోలు ఖర్చు, ఈజీ సర్వీస్ సదుపాయం కావాలంటే మారుతి సుజుకి బాలెనో బెస్ట్ట ఆప్షన్. ఎక్కువ వారంటీ కోసం టయోటా గ్లాంజాను కొనుగోలు చేయడం మంచిది.

Read Also: హ్యుందాయ్ నుంచి కొత్త ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్.. ధర జస్ట్ రూ. 5.80 లక్షలు!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×