Dhurandhar 2 Teaser: ఈ మధ్య విడుదలైన ధురంధర్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఏకంగా 1000 కోట్ల సినిమాగా పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రం.. కేవలం హిందీలో రిలీజ్ అయిన కానీ అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగింది. ఈ క్రమంలో ఈ సినిమా.. రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సీక్వెల్‌కు ధురంధర్ 2: ది రివెంజ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌పై..తాజాగా ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ టీజర్‌కు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. జనవరి 19, 2026న ఈ సర్టిఫికేషన్ పూర్తయ్యిందని సమాచారం. టీజర్ మొత్తం నిడివి 1 నిమిషం 48 సెకన్లు మాత్రమే ఉండటం గమనార్హం. అయితే టీజర్ మొత్తం కూడా అరాచకంగా ఉండబోతోంది అన్న టాక్ వినిపిస్తోంది. అంటే కథకు సంబంధించిన ప్రధాన విషయాలు బయటపెట్టకుండా.. చిన్నగా పవర్ ఫుల్ టీజర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సర్టిఫికేషన్‌తో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అధికారికంగా మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ టీజర్‌ను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్. ఈ టీజర్‌ను బోర్డర్ 2 సినిమా థియేటర్ ప్రింట్స్‌కు జత చేయనున్నారని సమాచారం.
‘ధురంధర్’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ ఈ రెండో భాగాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అతనితో పాటు సంజయ్ దత్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా పోషించిన రహ్మాన్ డకాయిట్ పాత్ర మరణించినప్పటికీ, రెండో భాగంలో ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా అతని పాత్రను మళ్లీ చూపించబోతున్నారని సమాచారం. అలాగే ‘బాడే సహబ్’ అనే పాత్రపై కూడా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1280 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం.
‘ధురంధర్ 2: ది రివెంజ్’ సినిమా మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌కు ‘A’ సర్టిఫికెట్ రావడంతో, ఈ సీక్వెల్ మరింత ఇంటెన్స్‌గా ఉండబోతుందనే అంచనాలు మరింత పెరిగాయి.
ALSO READ: Rashmika Mandanna: సల్మాన్ ఖాన్ సినిమా దిజాస్టర్ అవ్వడానికి గల కారణం బయటపెట్టిన రష్మిక..!