Dhurandhar: The Revenge: సినిమా కోసం నటులు ఎంత కష్టపడతారో మనం చాలా సార్లు వింటుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ కష్టం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా నటుడు డానిష్ ఇక్బాల్ తన కొత్త సినిమా Dhurandhar: The Revenge కోసం చేసిన కష్టం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ సినిమాలో ఆయన “బాడే సాహబ్” అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర ఒక నిజ జీవిత వ్యక్తి నుండి ప్రేరణ పొందినదని చెప్పబడుతోంది. ఈ పాత్ర కోసం డానిష్ ఇక్బాల్ పూర్తిగా తన లుక్ మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఆయన ప్రోస్థెటిక్ మేకప్ ఉపయోగించారు.
డానిష్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ప్రతి రోజు షూటింగ్ ఉంటే ఆయన ఉదయం చాలా ముందుగానే సెట్స్‌కి వెళ్లేవారని చెప్పుకొచ్చారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ మొదలైతే, ఆయన ఉదయం 3 గంటలకే అక్కడ ఉండాల్సి వచ్చేదంట. మేకప్ కోసం ఎక్కువ సమయం పడటం వల్ల ఆయన ఉదయంతో షూటింగ్ కి వెళ్లే వాటతా.
“ఆయనపై ఒకేసారి 5 నుండి 6 మంది మేకప్ ఆర్టిస్టులు పని చేసేవారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి కావడానికి దాదాపు 9 గంటల సమయం పట్టేది. అంతసేపు కూర్చోవడం మాత్రమే కాదు, ఆ సమయంలో తినడానికి కూడా అవకాశం ఉండేది కాదు,”అని చెప్పుకొచ్చాడు..దీంతో ఆయనకు చాలా ఇబ్బంది కలిగేదని చెప్పారు.
అంత కష్టమైన మేకప్ తర్వాత కూడా..ఆయన తన పాత్రను నిజంగా చూపించడానికి పూర్తి శ్రద్ధ పెట్టారు. సినిమా కోసం ఇంతటి కష్టాన్ని తీసుకోవడం అంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.
డానిష్ ఇక్బాల్ ఈ అనుభవం గురించి మాట్లాడుతూ, “ఇది చాలా కఠినమైన పని. కానీ పాత్ర కోసం ఇలాంటి కష్టాలు తీసుకోవడం తప్పనిసరి” అని అన్నారు. ఆయన మాటల్లోనే ఆయన ఎంత డెడికేషన్‌తో పనిచేశారో తెలుస్తుంది.
ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత.. అభిమానులు కూడా ఆయనను ప్రశంసిస్తున్నారు. ఒక పాత్ర కోసం ఇంతగా శ్రమించడం చాలా అరుదు. దీంతో ఈయనకు ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక సినిమా చూసినవారు కూడా ఈ పాత్రలో ఆయన కరెక్ట్ గా సరిపోయారు అని మెచ్చుకుంటున్నారు.
Also Read: Dhurandhar2 Controversy: హైప్ మధ్య షాక్..! ‘దురంధర్ 2’కు లీగల్ బ్రేక్?