E-Paper
Advertisement

Allu Arjun Raaka Movie: రాకా అర్థం ఏంటో తెలుసా?

Allu Arjun Raaka Movie: రాకా అర్థం ఏంటో తెలుసా?
Advertisement

Allu Arjun Raaka Movie: పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిపోయిన అల్లు అర్జున్.. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పైగా ఈ సినిమాలతో నేషనల్ అవార్డు అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈయన.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా అనౌన్స్మెంట్ వస్తోంది అంటే కొన్ని వారాల ముందు నుంచే టైటిల్స్ లీక్ అవడం అనేది చాలా కామన్. కానీ అట్లీ – బన్నీ కాంబినేషన్ మాత్రం ఎక్కడా లీక్ కాకుండా అటు మీడియాకే కాదు ఇటు అభిమానులకి సినీ ప్రేక్షకులకు కూడా చుక్కలు చూపించింది . ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. రాకా (Raaka) అంటూ ఒక పవర్ఫుల్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాకా.. టైటిల్ తోనే ఆసక్తి పెంచేసిన చిత్ర బృందం..

అసలు కలలో కూడా ఇలాంటి టైటిల్ ఊహించలేదు అంటూ సినీ విశ్లేషకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా లీకులకు చోటు లేకుండా సరైన సమయంలో ఊహించని బ్లాస్ట్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం.. ఇకపోతే ఎప్పుడైతే టైటిల్ ప్రకటించారో అసలు ఏంటి ఈ టైటిల్? ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టారు ? అసలు టైటిల్ కి కథకు సంబంధం ఏంటి? ఇలా పలు రకాల అనుమానాలు అభిమానులలో తలెత్తుతున్నాయి.. మరి రాకా వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? రాక అంటే ఏంటి ? దీనిని ఎక్కడినుంచి తీసుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రాకా అంటే అర్థం ఏంటి?

Advertisement

విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. రాక్షసుడు, రాకాసి అనే పదాల మూలాల నుంచే ఈ రాకా పుట్టినట్లు సమాచారం. మనిషిలోని మృగ ప్రవృత్తిని లేదా ఒక విధ్వంసకర శక్తిని సూచించే విధంగా ఈ పేరును డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా అటు టైటిల్ కి తగ్గట్టుగా బన్నీ ఫస్ట్ లుక్ కూడా ఊహించని విధంగా ఉంది. దీన్ని చూస్తుంటే ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరో, విలన్ ఇద్దరూ బన్నీనే కావడం విశేషం. ప్రస్తుతం విడుదలైన లుక్ విలన్ పాత్రకు సంబంధించినదని తెలుస్తోంది.

also read:Renu desai: రేణు దేశాయ్ పై బూతులు.. ఏపీలో మరో వ్యక్తి అరెస్ట్!

విలన్ పాత్ర ఓకే.. మరి హీరో పాత్ర చూపించేది ఎప్పుడు?

Advertisement

ముఖ్యంగా అల్లు అర్జున్ ని మునుపెన్నడూ చూడని గెటప్ లో చాలా రగ్గడ్ గా భయంకరమైన లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు ఇకపోతే రాకా లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన బన్నీ.. హీరో లుక్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇకపోతే అల్లు అర్జున్ 22వ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. మరో ఐదు మంది హీరోయిన్లు భాగం కానున్నట్లు సమాచారం. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు
హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×