E-Paper
Advertisement

Rashmika Mandanna: రష్మిక మెహందీ చీరపై తంజోరి లక్ష్మి దేవి.. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ.. కానీ ఎన్ని ప్రత్యేకతలో!

Rashmika Mandanna: రష్మిక మెహందీ చీరపై తంజోరి లక్ష్మి దేవి.. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ.. కానీ ఎన్ని ప్రత్యేకతలో!

Rashmika Mandanna: రష్మిక మందన్న భాషతో సంబంధం లేకుండా సౌత్ నార్త్ సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. కెరియర్ పరంగా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్న తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె గత కొంతకాలంగా నటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నారు. ఇక వీరిద్దరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఆకర్షణగా రష్మిక మెహందీ శారీ..

ఇక రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలలో భాగంగా వీరిద్దరూ ధరించిన దుస్తులు ఎంతో సాంప్రదాయపద్ధంగా చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. ఇటీవలే రష్మిక తన మెహేంది, ప్రధానం వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అయితే ఇందులో భాగంగా రష్మిక తన చీరపై తంజోరి లక్ష్మీదేవి(tanjore lakshmi devi) చిత్రపటంతో డిజైన్ చేయించడం ప్రస్తుతం చర్చలకు కారణం అయింది. రష్మిక మెహందీ వేడుకలకు సంబంధించిన ఈ దుస్తులను తొరాని డిజైనర్స్ డిజైన్ చేయించిన సంగతి తెలిసిందే.

చీరపై 1825 నాటి తంజోరి లక్ష్మీదేవి..

ఈ మెహేంది వేడుకకు అనుగుణంగా ఈమె గ్రీన్ అలాగే మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో చీరను ఎంతో అందంగా డిజైన్ చేయించారు. ఇక ఈ చీర అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది ఈ చీరపై 1825 నాటి తంజోరి లక్ష్మీదేవి చిత్రం నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేశారని తెలుస్తోంది. మన సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీర్వాదాలు శుభకార్యాలకు శుభసూచికంగా భావిస్తారు. ఇందులో భాగంగానే తన పెళ్లి వేడుకలో కీలకమైన ప్రధానం కార్యక్రమానికి తమిళనాడులోని తంజావూరులో ఉద్భవించిన తంజోరి లక్ష్మీదేవి అమ్మవారి రూపంతో ప్రత్యేకంగా చీర డిజైన్ చేయించారని తెలుస్తుంది. రష్మిక తంజోరి పెయింటింగ్స్ కి సంబంధించిన డిజైన్ చేయించడంతో పరోక్షంగా ఈమె సాంప్రదాయ చేతి వృత్తులకు మద్దతుగా నిలిచారు అంటూ ఈ ఫోటోలపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే 1825 కాలం నాటి లక్ష్మీదేవి చిత్రాన్ని ఈమె తన చీర పై డిజైన్ చేయించడంతో అమ్మవారిని అవమానించినట్టే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కానీ రష్మిక తన పెళ్లిలో చాలా సాంప్రదాయబద్ధంగా దుస్తులను డిజైన్ చేయించుకున్నారని ఈ పెళ్లి కోసం వీరు ఇలాంటి దుస్తులను డిజైన్ చేయించుకుని చేతి వృత్తుల వారికి మద్దతుగా నిలిచారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక విజయ్ మాత్రం వీరి పెళ్లి వేడుకలోని దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయని చెప్పాలి.ఇక రష్మిక విజయ్ పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో వీరిద్దరూ తిరిగి తమ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. వీరిద్దరూ జంటగా రణబాలి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Lavanya Tripathi: రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న లావణ్య..మంచి పనే చేసిందంటూ!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×