E-Paper
Advertisement

Dil Raju: అల్లు అర్జున్ 42 రూల్స్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: అల్లు అర్జున్ 42 రూల్స్.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన దిల్ రాజు!
Advertisement

Dil Raju: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దిల్ రాజు (Dil Raju)ఒకరు. ఈయన నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు దిల్ రాజు బ్యానర్ లో 50 కి పైగా సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా దిల్ రాజు మార్కండేయ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజుకు అల్లు అర్జున్ (Allu Arjun) వివాదం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

అల్లు అర్జున్ 42 రూల్స్..

ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా కావేరి బారువా అల్లు అర్జున్ నిబంధనల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి . అల్లు అర్జున్ ని కలవాలి అంటే 42 నిబంధనలను పాటించాలి అంటూ ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమయ్యాయి. ఇక ఈ వ్యాఖ్యలను అదునుగా భావించిన బన్నీ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బన్నీ టీమ్ ఈ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

దిల్ రాజుతో బన్నీ బాండింగ్..

Advertisement

ఇకపోతే ఈ విషయం గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజుకు కూడా ఇదే అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దిల్ రాజుతో అల్లు అర్జున్ కు ఎంతో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లు దువ్వాడ జగన్నాథం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటినుంచి బన్నీ దిల్ రాజు మధ్య బాండింగ్ చాలా మంచిగా ఉందనే చెప్పాలి. ఇలా బన్నీను చాలా దగ్గర నుంచి చూసిన దిల్ రాజుకు ఆయన నిబంధనల గురించి ప్రశ్నలు ఎదురవడంతో దిల్ రాజు ఊహించని సమాధానం చెప్పారు.

తెలియని విషయం గురించి మాట్లాడను..

Advertisement

బన్నీను కలవాలి అంటే ఈ నిబంధనలు అన్ని పాటించాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి కదా దీనికి మీ సమాధానం ఏంటి అనే ప్రశ్నకు దిల్ రాజు సమాధానం చెబుతూ.. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? నిజంగానే నాకు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియదు. సోషల్ మీడియాకు తను చాలా దూరంగా ఉంటానని దిల్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. తెలియని అంశం గురించి నేను అసలు మాట్లాడను అంటూ దిల్ రాజు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. అల్లు అర్జున్ గురించి దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ ని కలవాలంటే పాటించాల్సిన నిబంధనలు గురించి కూడా ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి అంటూ బన్నీ టీం హెచ్చరించి ఈ వార్తలకు చెక్ పెట్టారు .

Also Read: The Paradise film: నాని ది ప్యారడైజ్ రిలీజ్ వెనుక పెద్ద స్కెచ్ ఉందే.. పక్కాగా ప్లాన్ చేసిన డైరెక్టర్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×