E-Paper
Advertisement

TG Municipal Election Results Live Updates: పురపోరులో కాంగ్రెస్‌దే హవా.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే?

TG Municipal Election Results Live Updates: పురపోరులో కాంగ్రెస్‌దే హవా.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే?
Advertisement

TG Municipal Election Results Live Updates: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి నిర్దేశిత కేంద్రాల్లో పోలింగ్ మెుదలు కాగా.. విజేతలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంచనాలను నిజం చేస్తూ.. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తున్నారు.

మున్సిపల్ ఫలితాలు.. లేటెస్ట్ అప్‌డేట్స్

మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మెుత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 4 గంటల వరకూ 68 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 43 మున్సిపాలిటీలో విజయ ఢంకా మోగించింది. విపక్ష బీఆర్ఎస్ కేవలం 9 మున్సిపాలిటీల్లో గెలుపొందగా.. బీజేపీ కనీసం బోణీ కూడా చేయలేకపోయింది. అటు 15 మున్సిపాలిటీల్లో హంగ్ రాగా.. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు.

ఖమ్మం.. కాంగ్రెస్ వశం

Advertisement

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీలు హస్తం కైవసం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో మరి కొన్ని వార్డుల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పటికీ.. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికారం చేపట్టేందుకు అవసరమైన వార్డులను ఇప్పటికే కాంగ్రెస్ దక్కించుకుంది.

నల్గొండ క్లీన్ స్వీప్..

Advertisement

మరోవైపు నల్గొండ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లో విజయ దుందుభి మోగించింది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత జిల్లా అయిన నల్గొండలో కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించడంపై హస్తం వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 116 మున్సిపాలిటీలకు గాను ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో 23 చోట్ల కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, నేరేడు చర్ల, హుజూర్ నగర్, హాలియా, నందికొండ, మరిపెడ, డోర్నకల్, అశ్వరావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్ పూర్ చండూరు, భూత్పూర్, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాలాబాద్ మంథని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది.

బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలు

మరోవైపు బీఆర్ఎస్ కేవలం మూడు మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించింది. గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్ మున్సిపాలిటీలను కారు కైవసం చేసుకుంది. ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ.. వడ్డేపల్లిలో మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. అయితే బీజేపీ ఇప్పటివరకూ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించలేదు. కాగా, దేవరకద్ర, అలంపూర్, కోహిర్, కేసముద్రం మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు.

చరిత్రలో ఫస్ట్ టైమ్..

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 1వ వార్డులో ట్రాన్స్ జెండర్ సుధాకర్ విజయం సాధించారు. చిట్యాల పురపోరు చరిత్రలో ఒక ట్రాన్స్ జెండర్ వార్డ్ మెంబర్ గా గెలుపొందడం ఇదే తొలిసారి. దీంతో సుధాకర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి ఎంతో సంతోషంగా సుధాకర్ పరిగెత్తుకు వెళ్లడం కింద వీడియోలో చూడవచ్చు.

డ్యాన్స్ చేసిన ఎర్రబెల్లి

తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో స్థానిక కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డ్యాన్స్ చేశారు. కారులో నుంచి ఎర్రతువాలు ఊపుతూ చిందులు వేశారు. మరోవైపు సంగారెడ్డిలోనూ బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి జెండాను పట్టుకొని జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.

ఆ మున్సిపాలిటీలు హస్తగతం

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద పురపాలికలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. అలాగే పెద్దజిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ 1 చొప్పున గెలిచాయి. అటు నేరేడుచర్ల మున్సిపాలిటీని సైతం కాంగ్రెస్ సొంతం చేసుకుంది. 15 వార్డులకు గానూ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, జనసేన 1 స్థానాల్లో విజయం సాధించాయి.

బిగ్ టీవీ రిపోర్టర్‌పై దాడికి యత్నం

కల్వకుర్తిలో మున్నిపల్ ఎన్నికల కౌంటింగ్ ను కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ రిపోర్టర్ పై ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. గురుమూర్తి అనే వ్యక్తి దాడికి యత్నించాడు. 6, 11 వార్డుల్లో బీఎస్పీ అభ్యర్థిగా యాదమ్మ బరిలో నిలిచారు. అభ్యర్థితో ప్రభుత్వ టీచర్ గురుమూర్తి.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అయితే దీనిని బిగ్ టీవీ రిపోర్టర్ కవరేజ్ చేస్తుండగా.. గురుమూర్తి ఒక్కసారిగా రెచ్చిపోయారు. అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. అక్కడే ఉన్న కూర్చీని చేతిలోకి తీసుకొని దాడికి యత్నించారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని అతడ్ని వెనక్కి తీశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపేశారు.

కోహిర్ మున్సిపాలిటీలో హంగ్

సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో అనూహ్యంగా హంగ్ ఏర్పడింది. మెుత్తం 16 వార్డులకు 8 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 5 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక్కో వార్డులో ఎంఐఎం, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలంటే 9 వార్డుల్లో విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు.

ఉ. 10:15 గంటల వరకూ పరిస్థితి..

ఉదయం 10.15 గంటల సమయానికి రాష్ట్రంలోని 2582 వార్డులకు గాను 225 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ పార్టీ 128 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ 67, బీజేపీ 16, ఇతరులు 14 స్థానాల్లో గెలుపొందారు. అటు అశ్వరావులు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డులకు గాను 22 వార్డులకు గాను 17 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. బీఆర్ఎస్ 2, బీజేపీ 1 దక్కించుకున్నాయి.

కాంగ్రెస్ ముందంజ..

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 వార్డుల ఫలితాలు వెలువడగా.. కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 31, బీజేపీ 12, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.

ఆ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం..

నల్గొండ జిల్లాలో నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకోగా.. బీఆర్ఎస్ ఒక స్థానంలో విజయం సాధించింది. అటు సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకుంది. 18 వార్డులకు గాను 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ -3, ఇతరులు ఒకటి కైవసం చేసుకున్నారు. అలాగే చుండూరు మున్సిపాలిటీని సైతం కాంగ్రెస్ దక్కించుకుంది. 12 వార్డులకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

 

మధిరలో టీడీపీ అభ్యర్థి విజయం

10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం

 

ధర్మపురి మున్సిపాలిటీలో ఆధిక్యం దిశగా కాంగ్రెస్ పార్టీ
1, 4, 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు

 

జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో గెలుపు

1 వార్డులో బీజేపీ గెలుపు, 4 వార్డులో బీఅర్ఎస్,
7 వార్డులో బీఆర్ఎస్.. 10 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు

 

భువనగిరి మున్సిపాలిటీలో ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి విజయం

యాదగిరి గుట్ట మున్సిపాలిటీలో నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న విజయం

 

మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక విజయం

7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ ఘన విజయం

 

మెదక్ జిల్లా‌లోని నర్సాపూర్ మున్సిపాలిటీ ఫలితాలు వెల్లడి

7 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మోయిజ్ గెలుపు

 

జోగిపేట మున్సిపాలిటీ‌లో బోణీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ

4 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తిరుమల కల్పనా హరికృష్ణ గౌడ్ గెలుపు

 

ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం

ఒకటోవార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ ఘన విజయం సాధించారు

 

సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం

15వ వార్డులో కాంగ్రెస అభ్యర్థి సరిత విజయం

 

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఫలితం వెల్లడి

12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం

 

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి విజయం

ఒకటోవార్డులో బీజేపీ అభ్యర్థి బోద రాధ విజయం సాధించారు

 

మధిర మున్సిపాలిటీ మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ఆదిక్యం…

కాంగ్రెస్ -29(కాంగ్రెస్-25,టీడీపీ-4=29)

బిఆర్ఎస్ కూటమి(తెరాస-3,సిపిఎం-2=5)

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు BJP అభ్యర్థి బత్తిని లక్ష్మి అనారోగ్యంతో మృతి

పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందజ!

సంగారెడ్డి మున్సిపల్ కౌంటింగ్‌ కేంద్రంలో మొదలు కాని లెక్కింపు

తారా డిగ్రీ కాలేజీ కౌంటింగ్ రూమ్ నంబర్ 6లో నిలిచిన విద్యుత్

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది

అభ్యర్థులను క్యాంపులకు తరలించిన అధికార-విపక్షాలు

ఒక్కో టేబుల్‌పై ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కింపు

ఇప్పటికే ఓట్ల కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ హాల్ లోకి సూపర్ వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందని మాత్రమే అనుమతించనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి.. ఆ తర్వాతనే సాధారణ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ చేయనున్నారు.

తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,987 వార్డుల పరిధిలో బుధవారం ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం మంది ఓటు వేసినట్లు ఈసీ ప్రకటించింది. కార్పొరేషన్ల విషయానికి వస్తే అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం ఓటింగ్ వచ్చింది. అత్యల్పంగా నిజామాబాద్ లో 59.12 శాతం పోలింగ్ రికార్డయ్యింది.

Also Read: CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత

బుధవారం మున్సిపల్ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ బయటకొచ్చాయి. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ‘పీపుల్స్ పల్స్’ (Peoples Pulse) సంస్థ అభిప్రాయపడింది. 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68-76 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 29-36, బీజేపీ 3-5 స్థానాల్లో గెలవనుందని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ పార్టీ 36 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండ‌గా.. బీఆర్ఎస్ 29.7 శాతం, బీజేపీ 19.3 శాతం ఓట్లను సాధించే సూచనలు ఉన్నాయి. వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2582 వార్డులలో కాంగ్రెస్ 1210-1290 స్థానాల్లో, బీఆర్ఎస్ 860-930 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా విశ్లేషిస్తే.. ఎస్సీ (41.2 శాతం), ముస్లిం (44.7 శాతం), ఓబీసీ (33.6 శాతం) ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా ఎస్టీ వర్గం మాత్రం బీఆర్ఎస్ (36.9 శాతం) పట్ల సానుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.

Also Read: Chandrababu – Bandla Ganesh: తన కోసం తిరుమలకు పాదయాత్ర.. బండ్ల గణేశ్‌తో చంద్రబాబు ఏమన్నారంటే?

 

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×