E-Paper
Advertisement

చిరంజీవిని ఢీ కొట్టబోతున్న డస్కీ బ్యూటీ!

చిరంజీవిని ఢీ కొట్టబోతున్న డస్కీ బ్యూటీ!
Advertisement

Mega 158 Movie:తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇప్పుడు తన కొత్త సినిమాకి సిద్ధమయ్యారు. ఈ ఏడాది అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ అందుకొని జోరు మీద ఉన్న చిరంజీవి.. గతంలో తనకు ‘వాల్తేరు వీరయ్య’ రూపంలో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబీ కొల్లి తో తన 158వ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబి కొల్లి – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రెండవసారి వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకొని షూటింగుకు సిద్ధమవుతోంది.

షూటింగ్ కి సిద్ధమవుతున్న చిరంజీవి – బాబీ మూవీ..

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట కే నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపించినా.. ప్రస్తుతం ప్రొడక్షన్ భారం ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో కేవీఎన్ కూడా తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు ఒకవైపు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో 3 ప్రొడక్షన్ సంస్థలను బాబీ పరిశీలిస్తున్నారని.. ఒకవేళ కేవీఎన్ సంస్థ తప్పుకుంటే.. వారిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఫైనల్ చేయాలని దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉందని సమాచారం. నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యారు.

చిరంజీవిని ఢీ కొట్టడానికి సిద్ధమైన డస్కీ బ్యూటీ..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి చిరంజీవిని ఢీ కొట్టేది ఒక పవర్ఫుల్ విలన్ కాదు అని ,ఒక అమ్మాయి చిరంజీవికి వ్యతిరేకంగా విలన్ గా నటించబోతోంది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఎవరో కాదు డస్కీ బ్యూటీ డింపుల్ హయతి (Dimple hayathi).. సాధారణంగా డింపుల్ హయతి అంటే గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ . కానీ బాబి ఈ సినిమాలో ఆమెను సరికొత్తగా విలన్ పాత్రలో చూపించబోతున్నారట . మెగాస్టార్ వంటి దిగ్గజనటుడికి ఎదురు నిలిచే పాత్ర కావడంతో డింపుల్ చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతుందని సమాచారం. ఇకపోతే ఈ డిఫరెంట్ కాస్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అటు ఫిలిం వర్గాలు కూడా చర్చిస్తున్నాయి. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా సాగనుందని సమాచారం.

ALSO READ:ప్రియాంక చోప్రా సిటాడెల్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలెట్…

Advertisement

పైగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ కానుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ ఒకసారి కొత్త లుక్ లో కనిపించబోతున్నారని.. అటు బాబి కూడా ఈ పాత్రను చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అన్ని విషయాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవికి పోటీగా ఈ డస్కీ బ్యూటీ ఏ రేంజ్ లో తన పర్ఫామెన్స్ కనబరుస్తుందో చూడాలి.

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×