E-Paper
Advertisement

Nagabandham Movie: అలసిపోయిన రాత్రులు.. ప్రశ్నలతో నిండిన రోజులు.. ‘నాగబంధం’ పై అంచనాలు!

Nagabandham Movie: అలసిపోయిన రాత్రులు.. ప్రశ్నలతో నిండిన రోజులు.. ‘నాగబంధం’ పై అంచనాలు!
Advertisement

Nagabandham Movie: ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే దర్శక నిర్మాతలు, చిత్ర బృందం అలాగే 24 విభాగాల వారు ఏ రేంజిలో కష్టపడతారో అందరికీ తెలిసిందే. అయితే ఒక హిస్టారికల్ సినిమాను తెరకెక్కించాలంటే చరిత్రకు అనుగుణంగా ఆ కథని రూపొందించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సినిమా ఏ చరిత్ర పుస్తకాలలో కూడా రాయని గాథ అని.. ఈ కథను రూపొందించడానికి అలసిపోయిన రాత్రులు.. ప్రశ్నలతో నిండిన రోజులు గడిపామని.. సినిమా షూటింగ్ మొత్తం ఇలాగే సాగింది అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఆ చిత్రం ఏదో కాదు నాగబంధం. ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి ఎన్నో నెలలు పట్టింది అని చెప్పుకొచ్చారు. ఇకపోతే మరి కాసేపట్లో ఈ సినిమా టీజర్ విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు అభిషేక్ నామ ఒక నోట్ విడుదల చేశారు..

మరి కాసేపట్లో నాగబంధం టీజర్..

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం నాగబంధం. నభా నటేష్, ఐశ్వర్య మేనన్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో మరొకవైపు ఈ సినిమా నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇదిలా ఉండగా ఈరోజు శివరాత్రి సందర్భంగా టీజర్ను నేడు ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh 3) కూడా గెస్ట్ గా రాబోతున్నారట. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ మేకర్స్ ఒక కీలక నోటు విడుదల చేశారు.

మనసును తాకేలా డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్..

Advertisement

అందులో..” మేము నాగబంధం టీజర్ ను మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఇది కేవలం కథ కాదు.. ఏ చరిత్ర పుస్తకాలలో కూడా రాయని గాథ . ఈ కథను పూర్తిగా తెలుసుకొని రాయడానికి మాకు చాలా సమయం పట్టింది. ఇక ఈ స్టోరీ పూర్తిగా రాసిన తర్వాతే మేము ఊపిరి పీల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్శబ్దాలను ఎదుర్కొంటూ ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపాము. ఒక దర్శకుడిగా చెప్పాలి అంటే ఈ టీజర్ కేవలం విజువల్ మాత్రమే. అది మా ఊపిరిలో దాగి ఉన్న శ్వాస. చాలా కాలం అంతరాత్మలో దాచుకొని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం ఇది. ముఖ్యంగా మీరు చూసే ప్రతి ప్రేమలోనూ మా కష్టం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం ఉంది. మీకు నచ్చుతుందనే నమ్మకం బలపడింది. సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని తొలగించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా నిలిచిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. మేము కోరుకునేది ఒక్కటే.. స్వచ్ఛమైన మనసుతో ఈ టీజర్ను చూడండి.. మీ మనసును తాకితే మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లే” అంటూ అంచనాలు పెంచేశారు. ఇకపోతే ఒక్క మాటతో టీజర్ పై ఆసక్తి నెలకొనిందనే చెప్పాలి.

also read: Mamta Mohandas: ఆ హీరో నమ్మించి మోసం చేశారు – మమతా మోహన్ దాస్

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×