భారతీయ బైక్ రైడర్స్ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంజిన్ ఓవర్ హీటింగ్. మన దేశంలో వేసవిలో ఉష్ణోగ్రతలు 40°C, అంతకంటే ఎక్కువకు చేరుకుంటాయి. ట్రాఫిక్ జామ్‌లు, సరైన రోడ్లు లేకపోవడం, బైక్ సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం లాంటి సమస్యలు ఇంజిన్ ఓవర్ హీటింగ్ కు కారణం అవుతాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
బైక్ ఇంజిన్ సిలిండర్ లోపల ఇంధనాన్ని బర్న్ చేయడం ద్వారా పవర్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా బైక్ ముందుకు వెళ్తుంది. ప్యూయెల్ బర్న్ అయ్యే సమయంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా, కూలింగ్ సిస్టమ్ ముఖ్యంగా ఎయిర్ కూలింగ్, ఆయిల్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ టెంపరేచర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. కానీ, కూలింగ్ వ్యవస్థ తగినంత వేడిని తొలగించడంలో విఫలమైనప్పుడు, ఇంజిన్ వేడెక్కడానికి కారణం అవుతుంది. వేడి ఎక్కువ కావడం వల్ల ఇంజిన్ దెబ్బతింటుంది.
⦿ తక్కువ ఇంజిన్ ఆయిల్: ఇంజిన్ ఆయిల్ బైక్‌కు రక్తం లాంటిది. కొంత వేడిని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్ తక్కువగా ఉన్నా, చాలా రోజులు మార్చకపోయినా, సరిగా పని చేయదు. ఆ సమయంలో ఇంజిన్ భాగాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. మరింత వేడిని సృష్టిస్తుంది.
⦿ భారీ ట్రాఫిక్‌లో రైడింగ్: సిటీల్లో తరచుగా ఎక్కువ ట్రాఫిక్ జామ్‌లు ఉంటాయి. తక్కువ వేగం కారణంగా ఇంజిన్ చల్లబరచడానికి తగినంత గాలిని అందందు. బైక్‌ను నడుపుతూనే ఉండటం వల్ల వేడి త్వరగా పెరుగుతుంది.
⦿ బైక్‌ను ఓవర్‌లోడింగ్ చేయడం: బైక్ మీద పరిమితికి మించి లోడ్ వేయడం వల్ల ఇంజిన్ మీద మరింత భారం పడుతుంది. అదనపు లోడ్ ఇంజిన్‌ను మరింత హీటెక్కిస్తుంది.
⦿ కూలింగ్ వ్యవస్థ దెబ్బతినడం: ఎయిర్ కూల్డ్ బైక్‌లలో, బ్లాక్ అయిన ఫిన్స్ ఇంజిన్ లోకి గాలిని చేరకుండా ఆపుతాయి. ఆయిల్ పాతదైనా, కూలర్ దెబ్బతిన్నట్లయితే, వేడి సరిగ్గా బయటకు రాదు. లిక్విడ్ కూల్డ్ బైక్ లలో తక్కువ కూలెంట్ స్థాయి ఉన్నప్పుడు కూడా ఓవర్‌హీ టింగ్‌కు కారణమవుతుంది.
⦿ సర్వీసింగ్ సరిగా లేకపోవడం: రెగ్యులర్ సర్వీసింగ్‌ను పట్టించుకోకపోవడం వల్ల బైక్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్‌లు చెడిపోతాయి. పనితీరును తగ్గిస్తాయి. ఇంజిన్‌ను ఒత్తిడికి గురి చేస్తుంది. ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.
⦿ ఇంజిన్ ఆయిల్ ను చెక్ చేయాలి: మీ ఆయిల్ లెవెల్ సరిగ్గా ఉంచుకోవాలి. షెడ్యూల్ ప్రకారం మార్చాలి. ప్రతి 3,000–5,000 కి.మీ కి ఆయిల్ మార్చడం మంచిది.
⦿కూలింగ్ సిస్టమ్ ని శుభ్రంగా ఉంచాలి: బైక్ ఎయిర్ కూల్డ్ అయితే, దుమ్ము, బురద లేకుండా శుభ్రంగా ఉంచాలి. కూలెంట్ లెవల్స్, రేడియేటర్ కండిషన్ ని క్రమం తప్పకుండా చెక్ చేయాలి.
⦿ ఓవర్ లోడింగ్ వద్దు: బైక్ మీద పరిమితికి మించి బరువు తీసుకెళ్లకూడదు.
⦿ స్మార్ట్ గా రైడ్ చేయండి: ఎక్కువ సేపు ట్రాఫిక్ లో చిక్కుకుపోతే, ఇంజిన్ ని నడుపుతూ ఉండటానికి బదులుగా ఆఫ్ చేయండి. అనవసరమైన వేడి పెరుగుదలను తగ్గిస్తుంది.
⦿ రెగ్యులర్ గా సర్వీసింగ్ చేయించండి: రెగ్యులర్ సర్వీసింగ్ కారణంగా ఆయిల్ మార్పులు, ఎయిర్ ఫిల్టర్ శుభ్రపరచడం, అరిగిపోయిన భాగాలను తనిఖీ చేస్తారు. ఇంజిన్ ను హెల్దీగా, చల్లగా ఉంచుతుంది.
Read Also: ఎర్లీ మార్నింగ్ vs లేట్ నైట్.. ఏ టైమ్ లో డ్రైవింగ్ చేయడం బెస్ట్?