E-Paper
Advertisement

Director Aditya :’దురంధర్’ చూసి నోళ్లు మూసుకున్నారు..దర్శకుడు వివాదాస్పద కామెంట్స్

Director Aditya :’దురంధర్’ చూసి నోళ్లు మూసుకున్నారు..దర్శకుడు వివాదాస్పద కామెంట్స్
Advertisement

Director Aditya : రణవీర్ సింగ్ నట విశ్వరూపం, దర్శకుడు ఆదిత్య విజన్ తోడైతే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో ‘దురంధర్’ నిరూపిస్తోంది. విడుదలైన రోజు నుండి ఈ చిత్రం ఒక సునామీలా దూసుకుపోతోంది. ఇప్పటికే అనేక మైలురాళ్లను అధిగమించిన ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా ఇండియన్ సినిమా దిగ్గజాలు ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ కలెక్షన్ల టార్గెట్‌గా బరిలోకి దిగింది.

19 రోజుల్లోనే 940 కోట్లు..
కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.940 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. రేపు క్రిస్మస్ సెలవు కావడంతో పాటు, ఈ వీకెండ్ కూడా తోడవ్వడంతో మరో రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా సునాయాసంగా రూ.1000 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

డైరెక్టర్ ఆదిత్య ఫైర్
ఈ భారీ విజయంపై దర్శకుడు ఆదిత్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. దురంధర్ చిత్రానికి కోటికి పైగా టికెట్లు అమ్ముడుపోవడం మా కష్టానికి దక్కిన ప్రతిఫలం. విడ్డూరం ఏమిటంటే, ఇవన్నీ ఆర్గానిక్‌గా జరిగిన బుకింగ్స్. కానీ మొదటి రోజు కార్పొరేట్ బుకింగ్స్ అంటూ మమ్మల్ని ఎగతాళి చేసిన వారంతా, ఇప్పుడు ఈ వసూళ్లు చూసి నోళ్లు మూసుకున్నారు. దేశంపై మాకున్న ప్రేమకు ఈ సినిమా ఒక నిదర్శనమని ఆదిత్య ఘాటుగా స్పందించారు.

గంటకు 22 వేల టికెట్లు
సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా బుక్ మై షోలో ప్రతి గంటకు 22 వేల టికెట్లు అమ్ముడవుతుండటం చూస్తుంటే, ఈ సినిమా థియేట్రికల్ రన్ మరో నెల రోజుల పాటు ఉండేలా కనిపిస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిపోనుంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×