E-Paper
Advertisement

Director Anudeep : అయ్య బాబోయ్.. డైరెక్టర్ లో మస్త్ షెడ్స్ ఉన్నాయి బ్రో.. పెళ్లిపై షాకింగ్ నిర్ణయం..?

Director Anudeep : అయ్య బాబోయ్.. డైరెక్టర్ లో మస్త్ షెడ్స్ ఉన్నాయి బ్రో.. పెళ్లిపై షాకింగ్ నిర్ణయం..?

Director Anudeep : టాలీవుడ్ యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరు అనుదీప్.. ఈయన తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది.. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ డైరెక్టర్ ఈమధ్య కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. దాదాపు మూడు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం మళ్ళీ డైరెక్టర్గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ డైరెక్టర్ విశ్వక్ సేన్ కాంబినేషన్లో ఫంకీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా వచ్చే నెలలో థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ మొదలెట్టారు చిత్రయూనిట్.. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ అనుదీప్ గురించి ఎన్నో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి.. పెళ్లి గురించి డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

అనుదీప్ లో ఇంత మ్యాటర్ ఉందా..? 

డైరెక్టర్ అనుదీప్ ఈమధ్య పలు టీవీ షోలకు కూడా హాజరవుతూ ప్రేక్షకులను తన కామెడీతో నవ్విస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ సుమ అనుదీప్ కాంబినేషన్లో వచ్చే షోలు ప్రేక్షకులను బాగా అలరిస్తూ వస్తున్నాయి.. తాజాగా ఫంకీ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు చిత్ర యూనిట్. అందులో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ కాయదు లోహర్, అలాగే డైరెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఆ షోకి యాంకర్ గా సుమ వ్యవహరించారు.. అందులో ముందుగా పంపి టీజర్ గురించి సుమ మాట్లాడగా.. పెళ్లి ప్రేమను గురించి మధ్యలో ప్రశ్నలు అడుగుతుంది. ముందుగా డైరెక్టర్ ని ప్రేమ పై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అంటుంది. మీరు ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదా అని సుమ అడుగుతుంది. టెన్త్ క్లాస్ లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ ఆ అమ్మాయికి నిజం చెప్పలేదు ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటుంది అని డైరెక్టర్ అంటారు. ఇక కాలేజీలో ఎవరిని ప్రేమించలేదా అని సుమ అడుగుతుంది. లేదు ఎవరిని ప్రేమించలేదు. ఫ్యూచర్లో ప్రేమ పెళ్లి అలాంటివి ఉన్నాయా లేవా అని సుమా అడుగుతుంది. జీవితంలో నేను పెళ్లి చేసుకోను అని డైరెక్టర్ చెప్తాడు. అయితే ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవడంతో డైరెక్టర్ అనుదీప్ జీవితంలో పెళ్లి చేసుకోడు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు చర్చిస్తున్నారు.. చూడ్డానికి సైలెంట్ గా కనిపించే ఈ డైరెక్టర్ లో ఇంత మ్యాటర్ దాగి ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

Also Read :ప్రతిరోజు అదే పని.. నరకం చూశాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న హీరో స్టోరీ..

నటుడుగా అనుదీప్ సక్సెస్..

టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ పిట్టగోడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ తో తెరకెక్కించిన ప్రిన్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది కానీ కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.. ఆ తర్వాత మ్యాడ్, కల్కి, మ్యాడ్ స్క్వేర్, హరి హర వీరమల్లు, మిత్ర మండలి వంటి సినిమాల్లో నటుడుగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను నవ్వించేసాడు. ఇప్పుడు మళ్లీ డైరెక్టర్ గా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. ప్రస్తుతం ఈయన డైరెక్షన్ లో ఫంకీ మూవీ రాబోతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇక సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

×