E-Paper
Advertisement

Vikrant Massey: ప్రతిరోజు అదే పని.. నరకం చూశాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న హీరో స్టోరీ..

Vikrant Massey: ప్రతిరోజు అదే పని.. నరకం చూశాను.. కన్నీళ్లు తెప్పిస్తున్న హీరో స్టోరీ..
Advertisement

Vikrant Massey: కష్టేఫలి అని పెద్దలు ఊరికే అనలేదు.. కష్టపడి పని చేస్తే ఫలితం దక్కుతుంది. ఇది మాత్రం అక్షర సత్యం. కష్టం ఊరికే పోదు అని అంటారు. సినీ ఇండస్ట్రీలో కష్టపడి ఎన్నో అవమానాలను దిగమింగుకొని ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోలు ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే ఒకరు. అతి చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశానంటున్న ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆ హీరో జీవితంలో అనుభవించిన కష్టాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఆ హీరో గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

రోజులో 16 గంటలు కష్టపడ్డాను..

విక్రాంత్ 16 ఏళ్ల వయసులోనే కెమెరా ముందు వచ్చారు.. ఆయనకు చదువంటే మహా ఇష్టం.. కానీ డబ్బులు లేక హోటల్లో వెయిటర్ గా పనిచేశారు. అలాగే ఓ డాన్స్ స్కూల్ కు సంబంధించి ఆయన ఇన్స్ట్రక్టర్ గా కూడా పనిచేసినట్లు చెప్పారు. ప్రతిరోజు నాలుగు లోకల్‌ ట్రైన్స్‌ మారేవాడిని. 16 గంటలు పనిచేసేవాడిని.. ప్రతిరోజు ఒక నాలుగు బిస్కెట్లు తిని ట్యాప్ దగ్గర నీళ్లు తాగి కడుపు నింపుకునే వాడిని.. నా కొన్ని నెలలు నా కడుపు మార్చుకున్నాను అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఒక షో చేసినట్లు విక్రాంత్ తెలిపారు. అలా ఆ షో చేయడానికి దాదాపు 8 నెలలు కష్టపడినట్లు హీరో బయటపెట్టారు. కానీ దరిద్రం వెనక్కి లాగినట్లుగా ఆ షో ప్రసారం కాలేదని చెప్పాడు.. అంతే కాదు దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా సగమే ఇవ్వడంతో చాలా బాధపడినట్లు విక్రాంత్ చెప్పుకొచ్చారు..

Advertisement

Also Read :ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్..

బాలికా వధు సీరియల్ తో ఎంట్రీ.. 

కష్టపడే వాడికి కష్టాలు అన్నట్లుగా చాలా కష్టాలను అనుభవించిన తర్వాత… నేను చేసిన షో టీవీలో అర్ధరాత్రి ప్రసారమైంది. కానీ దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు అందలేదు అని విక్రాంత్ అన్నారు. ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన బ్యానర్‌లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైనట్లు ఆయన చెప్పుకొచ్చారు.. విక్రాంత్ బుల్లితెరపై నటించడం మొదటి సీరియల్ బాలిక వధు ( చిన్నారి పెళ్లికూతురు ) అప్పట్లో ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా ఈ సీరియల్ ని డబ్ చేశారు… ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అలా ఆ సీరియల్ తర్వాత అతని క్రేజ్ పెరిగిపోయింది.. సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చిందని విక్రాంత్ అన్నారు. లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్‌ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాల విషయానికొస్తే… రోమియోలో నటిస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌, తృప్తి డిమ్రి మెయిన్ రోల్లో నటించిన ఈ చిత్రం వచ్చే నెల 13న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×