E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ ను కలిసిన డైరెక్టర్ బాబీ.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారా?

పవన్ కళ్యాణ్ ను కలిసిన డైరెక్టర్ బాబీ.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారా?
Advertisement

Director Boby: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబి (Bobby)త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఏప్రిల్ 11వ తేదీ ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగి ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో డైరెక్టర్ బాబి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని కలిశారు.

ఋషిలా కనిపించారు..

పవన్ కళ్యాణ్ ని కలిసిన ఈయన ఆయనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను ఒక కర్మయోగిని కలిసాను అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బాబి ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..”ఆయన్ని కలవడానికి వెళున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం.. ఆయనతో పని చేసిన సమయంలో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక రుషిలా కనిపించారు..

కర్మయోగిని చూశాను..

Advertisement

రాజకీయాలలో తమ ఆస్తులను పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం, కానీ అన్ని సౌకర్యాలను వదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బ్రతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపు ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరిగా ఒక మాట చెబుతున్నాను జ్ఞానం కోసం రాజ భోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడి గురించి మనం చరిత్రలో చదువుకున్నాం.. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను. జైహింద్ లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” అంటూ బాబీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

పవన్ కళ్యాణ్ ను కర్మయోగి శిఖరం అంటూ ఈయన ప్రశంసలు కురిపించడంతో పవన్ పట్ల ఈయనకు ఎంతటి గౌరవం ఉందో స్పష్టమవుతుంది అయితే ఇలా ఉన్నఫలంగా బాబి పవన్ కళ్యాణ్ ను కలవడానికి గల కారణమేంటనే చర్చ మొదలైంది బహుశా వీరి కాంబినేషన్లో మరోసారి సినిమా రాబోతోందా అందుకోసమే పవన్ ను బాబీ కలిసారా లేదంటే ఏప్రిల్ 11వ తేదీ చిరంజీవితో బాబి చేయబోయే సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలకటం కోసమే తనని కలిసారా? అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల నిహారిక వరుణ్ తేజ్ సినిమా పూజా కార్యక్రమాలలో పవన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన అన్నయ్య చిరంజీవి సినిమాకు కూడా ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: అల్లు అర్జున్ ‘రాకా ‘ పోస్టర్ పై షారుక్ ఆసక్తికర పోస్ట్.. నీ లాగే పోస్టర్ కూడా ఉందంటూ!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×