Kamran Akmal On Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( VAIBHAV SOORYAVANSHI) పేరు మారుమోగుతోంది. నిన్న ముంబై ఇండియన్స్ పైన వైభవ్ సూర్యవంశీ 46 పరుగులు సాధించిన నేపథ్యంలో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టిన వైభవ్ సూర్యవంశీని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ( kamran akmal) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా బౌలింగ్ లోనే ఇరగదీశాడు..షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) వేస్తే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతాడని వ్యాఖ్యానించారు కమ్రాన్ అక్మల్.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై కమ్రాన్ అక్మల్, బాసిత్ ఆలీ ఇద్దరూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు చెందిన 15 ఏళ్ల ఈ వైభవ్ సూర్య వంశీ అత్యంత ప్రమాదకరంగా రోజు రోజుకు మారుతున్నాడని వెల్లడించారు. బౌలర్లు అంటే భయం లేకుండా ఆడి ఇరగదీస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కు సంబంధించిన బుమ్రా, శార్దూల్ ఠాకూర్, బోల్ట్, దీపక్ చాహర్ లాంటి బౌలర్ల పై విరుచుకుపడ్డాడని వెల్లడించారు. జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాసు బౌలర్ ను కూడా వదలలేదని.. షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ లాంటి వాళ్ళు వేస్తే చుక్కలు చూపించడం గ్యారంటీ అన్నారు.
ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akthar) బౌలింగ్ చేస్తే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టడం గ్యారెంటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ క్రికెట్ లో టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళు చాలా మంది ఉన్నారని.. అలాంటి వాడే ఈ వైభవ్ సూర్య వంశీ అని పేర్కొన్నారు. ఈ వైభవ్ సూర్య వంశీని పాకిస్తాన్ బౌలర్లు ఎదుర్కోవడం చాలా కష్టమని తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ బౌలర్లు వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొంటే.. ఆ రోజు వాళ్లకు నిద్రలేకుండా చేస్తాడని హెచ్చరించారు. షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ ( Wasim Akram) లాంటి దిగ్గజాలు బౌలింగ్ చేసిన కూడా టెక్నిక్ వాడి, సిక్సర్లు కొడతాడని స్పష్టం చేశారు. కానీ ఏ బౌలర్ వేసిన కూడా అతడు భయపడే పరిస్థితి లేదని.. 15 ఏళ్ల కుర్రాడిలా అస్సలు బిహేవ్ చేయడం లేదని బాంబు పేల్చారు. అయితే అతని ఏజ్ విషయంలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ.. బ్యాటింగ్ మాత్రం అదరగొడుతున్నారని ప్రశంసించారు.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా
🚨 PAKISTANI EX-CRICKETERS IN AWE OF VAIBHAV SOORYAVANSHI
A 15-year-old smashing Jasprit Bumrah for a first-ball six tells you everything about his extraordinary talent. Pakistan is lucky it doesn’t face India regularly, those contests would be outright humiliations." pic.twitter.com/s84r2cHq2q
— Brutal Truth (@sarkarstix) April 8, 2026