E-Paper
Advertisement

Boyapati Srinu: బిగ్ డిజాస్టర్ అయినా భారీగా పెంచేసిన రెమ్యూనరేషన్… అఖండ 2కి బోయపాటికి ఎన్ని కోట్లంటే?

Boyapati Srinu: బిగ్ డిజాస్టర్ అయినా భారీగా పెంచేసిన రెమ్యూనరేషన్… అఖండ 2కి బోయపాటికి ఎన్ని కోట్లంటే?
Advertisement

Boyapati Srinu: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసే మంచి సక్సెస్ ని అందుకున్నాడు డైరెక్టర్ బోయపాటి. ఈమధ్య ఆయన ఖాతాలో బ్లాక్ బాస్టర్ హిట్స్ సినిమాలైతే పడలేదు.. ప్రస్తుతం బాలకృష్ణ కాంబినేషన్లో అఖండ 2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఇది ఇలా ఉండగా డైరెక్టర్ బోయపాటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే డైరెక్టర్ రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అఖండ 2 కు బోయపాటి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు? నెక్స్ట్ మూవీకి ఎన్ని కోట్లు తీసుకుంటారో ఒకసారి తెలుసుకుందాం..

సినిమాలు ప్లాప్.. రెమ్యూనరేషన్ డబల్..

డైరెక్టర్ బోయపాటి మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. గత రెండేళ్ల నుంచి బోయపాటి కాంబినేషన్లో హిట్ సినిమాలు పడలేదు. రామ్ పోతినేని తో స్కంధ మూవీ చేశాడు.. ఆ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు అఖండ 2 ను సెట్స్ మీదకు తీసుకొని వెళ్లాడు. బాలయ్యతో గతంలో చాలా సినిమాలు చేశాడు ఆ సినిమాలన్నీ కూడా బిగ్గెస్ట్ హిట్టుగా నిలవడంతో ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మూవీకి బోయపాటి రెమ్యూనరేషన్ ను కూడా పెంచేసినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. స్కంద మూవీకి 16 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఇప్పుడు అఖండ 2 కు రెమ్యూనరేషన్ డబుల్ తీసుకుంటున్నాడట. సినిమాకు ఏకంగా 36 కోట్ల రెమ్యూ నరేషన్ తీసుకుపోతున్నట్లు తెలుస్తుంది.. సినిమాలు డిజాస్టర్ అయినా సరే ఆయన రెమ్యూనరేషన్ మాత్రం ఈ రేంజ్ లో ఉండటం గమనార్హం.. ఇదే సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read : అమూల్యకు విశ్వం గిఫ్ట్.. ప్రేమ కాళ్ళు పట్టుకున్న ధీరజ్.. నర్మదకు శ్రీవల్లి షాక్..

అఖండ 2 అప్డేట్స్.. 

బాలయ్య, బోయపాటి కాంబోలో అఖండ 2 తెరకెక్కుతుంది..14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీనుతో నేను చేస్తున్న నాలుగో సినిమా ఇది. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఇది రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన పోస్టర్లు, టీజర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. రీసెంట్గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. బాలయ్య కెరియర్ లో ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుంది అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మూవీ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×