E-Paper
Advertisement

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనా?

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనా?
Advertisement

NBK 111 Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ .ఆరుపదుల వయసు దాటినా సరే వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఒకవైపు రాజకీయాలలో చురుగ్గా ఉంటున్న ఈయన.. హిందూపురం ఎమ్మెల్యేగా మూడవసారి గెలిచి ప్రజల మన్ననలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంటే.. మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ వయసులో కూడా డూప్ లేకుండా యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బాలయ్య.. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

బాలయ్య కోసం బాలీవుడ్ బ్యూటీ..

గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. 2024 సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలయ్య ఇందులో మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉందని, పైగా ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి దింపినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే..గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో చంద్రిక రవి స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకోగా.. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాదులో ప్రత్యేక సెట్..

Advertisement

బాలయ్య నర్గీస్ ఫక్రీ మధ్య సాగే ఈ మాస్ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాదులో ఒక ప్రత్యేక సెట్ కూడా వేశారట. పైగా ఈ సెట్లో ఈ రోజు నుంచి ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైనట్లు సమాచారం. వీరిద్దరి జోడితో హిట్ సాంగ్ ఖాయమని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. మొత్తానికైతే బాలయ్య బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీతో చేసే డాన్స్ ఏ విధంగా ఉంటుందో తెరపై చూడాలని అభిమానులు కూడా అప్పుడే ఆత్రుత కనబరుస్తున్నారు. బాలయ్య డాన్స్ స్టెప్స్ కి నర్గీస్ అందం తోడైతే ఆ రేంజ్ వేరే లెవెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

also read:అషురెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. బయటపడ్డ సాక్ష్యాలు!

బాలయ్య తదుపరి సినిమాలు..

Advertisement

ఇక బాలయ్య తదుపరి సినిమాల విషయానికొస్తే.. మరొకవైపు బాలయ్య కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను ఎంపిక చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు సినిమాకి మేజర్ హైలైట్ గా నిలుస్తాయి అని టాలీవుడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇకపోతే విద్యాబాలన్ బాలయ్య గతంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ – బసవతారకం పాత్రలలో వీరిద్దరూ తమ నటనతో మెప్పించారు. తర్వాత మళ్ళీ ఈ హిట్ జోడిని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు కొరటాల శివ. మరి ఆ మ్యాజిక్ ఏ విధంగా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×