E-Paper
Advertisement

40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌కు గుడ్‌బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!

40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌కు గుడ్‌బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

New Railway Reservation System: భారతీయ రైల్వే 40 ఏళ్ల నాటి టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా మారబోతోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త ప్లాట్‌ ఫారమ్‌కు మార్చేందుకు రెడీ అవుతోంది. రైల్వే శాఖ  తీసుకొస్తున్న ఈ వ్యవస్థతో టికెట్ బుకింగ్ సేవలు మరింత వేగంగా, సులభంగా మారనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ రిజర్వేషన్ వ్యవస్థను మార్చే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పాత వ్యవస్థ స్థానంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త వ్యవస్థను తీసుకురావడం ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చాలని రైల్వే శాఖ భావిస్తోంది.

1986లో రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ ప్రారంభం

భారతీయ రైల్వే ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ మొదటగా 1986లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగడం, ఆన్‌ లైన్ సేవల వినియోగం పెరగడంతో ఈ వ్యవస్థలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా 2002లో ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రావడం రైల్వే సేవల్లో విప్లవం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుక్ అయ్యే రైలు టికెట్లలో దాదాపు 88 శాతం టికెట్లు ఆన్‌ లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి.

‘రైల్‌వన్’ సూపర్ యాప్ తో మరిన్ని సౌకర్యాలు

Advertisement

ఇటీవలి కాలంలో రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ‘రైల్‌వన్’ సూపర్ యాప్ ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోంది. 2025లో ప్రారంభించిన ఈ యాప్‌ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అన్నదానిపై ఈ యాప్ ముందుగానే అంచనా వేస్తోంది.  ఈ అంచనాల కచ్చితత్వం గతంలో 53 శాతం ఉండగా ఇప్పుడు 94 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ‘రైల్‌వన్’ యాప్ ద్వారా రిజర్వ్డ్ టికెట్లు, అన్‌రిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్‌ ఫారమ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే టికెట్ రద్దు, రీఫండ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు తమ టికెట్ వెయిటింగ్ స్టేటస్, రైలు సమయాలు, లైవ్ రన్నింగ్ స్టేటస్, ప్లాట్‌ ఫారమ్ వివరాలు, కోచ్ పొజిషన్ లాంటి సమాచారం కూడా ఈ యాప్‌ లో పొందవచ్చు. రైల్ మదద్ ద్వారా ప్రయాణికుల ఫిర్యాదులు, సాయం వంటి సేవలు కూడా అందిస్తున్నారు.

రోజూ 9.23 లక్షల టికెట్ల బుకింగ్..

రైల్ వన్ యాప్ ద్వారా రోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇందులో 7.2 లక్షల అన్‌ రిజర్వ్డ్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వ్డ్ టికెట్లు ఉన్నాయి. ఈ యాప్‌ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొత్త రిజర్వేషన్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత టికెట్ బుకింగ్ మరింత వేగంగా, కచ్చితంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైల్ రూట్ ఫిక్స్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×