E-Paper
Advertisement

Kirtan Nadagouda: ప్రముఖ దర్శకుడు ఇంట విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కొని చిన్నారి మృ*తి

Kirtan Nadagouda: ప్రముఖ దర్శకుడు ఇంట విషాదం.. లిఫ్ట్ లో ఇరుక్కొని చిన్నారి మృ*తి
Advertisement

Kirtan Nadagouda: కన్నడ, తెలుగు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఇప్పుడిప్పుడే దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న వారిలో ప్రముఖ దర్శకుడు కీర్తన్ నాదగౌడ(kirtan Nadagouda) ఒకరు. ప్రముఖ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన త్వరలోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం శ్రీ కీర్తన్ తన సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు అయితే తాజాగా ఈయన ఇంట తీవ్ర విషాదం నెలకొందని తెలుస్తోంది.

చిన్నారి సోనార్ష్ మృతి..

దర్శకుడు కీర్తన్ కుమారుడు లిఫ్ట్ ప్రమాదంలో మరణించడంతో విషాదఛాయలు అలముకున్నాయి. కీర్తన్, సమృద్ధి పటేల్(Samruddhi Patel) దంపతులకు నాలుగున్నర సంవత్సరాల కుమారుడు సోనార్ష్(Sonaarsh) కె. నాదగౌడ్ ఉన్నారు . సోమవారం ఈ చిన్నారి లిఫ్టులో ఇరుక్కుని మరణించారు. ఇలా చిన్నారి సోనార్ష్ మరణ వార్త దర్శకుడు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఇక ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిన్నారి మరణం పట్ల స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక చిన్నారి మరణం పై సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ ఈ కుటుంబానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో..

Advertisement

ఇక కీర్తన్ నాదగౌడ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కేజీఎఫ్ సినిమాకు కీర్తన్ సెకండ్ యూనిట్ దర్శకుడిగా పనిచేశారు. ఇలా ప్రశాంత్ నీల్ సినిమాలకు పని చేస్తూ దర్శకుడిగా అనుభవం పొందిన కీర్తన్ త్వరలోనే తెలుగులో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ నీల్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

హర్రర్ థ్రిల్లర్ సినిమాగా..

Advertisement

కీర్తన్ నాదగౌడ్ దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో హను రెడ్డి, సూర్య రాజ్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ దర్శకుడుగా మారి ఇండస్ట్రీలో బిజీగా ఉన్న కీర్తన్ ఇంట ఇలాంటి విషాదఛాయలు అలుముకోవడంతో ఈయన కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలి అంటూ అభిమానులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ ఘటనతో కొన్ని రోజులపాటు ఈయన సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×