Ravi Babu: చాలామంది ఫాదర్స్ తమ కొడుకులు ఏం అవ్వాలి అని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంచెం అది మారింది కానీ ఒకప్పుడు మాత్రం నా కొడుకు ఈ పని చేయాలి అని ఫాదర్స్ కి కూడా ఒక కల ఉండేది. ఆ కళను నెరవేర్చే కొడుకులు కూడా ఉండేవాళ్ళు. అయితే ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణకు అల్లరి నరేష్ ను డైరెక్టర్ గా చూడాలి అనే డ్రీమ్ ఉండేది. ఆర్యన్ రాజేష్ ను హీరోగా చూడాలి అనుకున్నారు. ఆర్యన్ రాజేష్ కూడా హీరోగా సినిమాలు చేశాడు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.
అయితే దర్శకుడు అవుతాడు అనుకున్న అల్లరి నరేష్ హీరో అయిపోయాడు. కేవలం హీరో అయిపోవడమే మాత్రమే కాకుండా సక్సెస్ఫుల్గా తన జర్నీని కొనసాగిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇప్పుడు ఇవివి సత్యనారాయణ మనమధ్య లేకపోయినా కూడా తన తండ్రి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు అల్లరి నరేష్.
ఇవివి సత్యనారాయణకు నటుడు చలపతిరావుకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం వలన చలపతిరావు కొడుకు రవిబాబు మరియు ఇవివి సత్యనారాయణ కొడుకు నరేష్ మధ్య మంచి పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ కూడా కలుస్తూ తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు.
ఒక తరుణంలో రవిబాబు మాట్లాడుతూ బానే ఉన్నావు కదా నువ్వు హీరోగా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పారట. నన్ను ఎవరు పెట్టి సినిమా తీస్తారు అని నరేష్ అన్నాడు. నేనే నిన్ను పెట్టి సినిమా చేస్తాను అని చెప్పారట. అని చెప్తారులే పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని నరేష్ అనుకున్నాడు.
ఒకరోజు నరేష్ కు ఫోన్ చేశాడు రవిబాబు. నీ దగ్గర ఉన్న బట్టలు పట్టుకుని రామానాయుడు స్టూడియోకి వచ్చే అని చెప్పారు. అయితే అక్కడికి వెళ్లిన వెంటనే మనం అల్లరి అనే ఒక సినిమా చేస్తున్నాము దాని గురించి ఆడిషన్ నువ్వే హీరో అని రవిబాబు చెప్పాడు. ఇప్పటికీ నరేష్ కథ కూడా వినలేదు.
అయితే అలా డైరెక్ట్ ఆడిషన్ చేసిన తరువాత ఇవివి సత్యనారాయణ కూడా రవి బాబుకి చెప్పారట వద్దు నువ్వు కొత్త వాడివి వాడు కొత్తవాడు అని. అయినా కూడా వినకుండా నరేష్ ను పెట్టి అల్లరి సినిమా చేసేసారు రవిబాబు. అయితే ఆ సినిమా రేపు విడుదలవుతుంది అనగానే ముందు రోజు సురేష్ బాబు, చలపతిరావు, ఇవివి సత్యనారాయణ కలిసి సినిమా చూశారట.
నరేష్ కు టెన్షన్ పట్టుకుంది. మొత్తానికి నరేష్ వాళ్ళ అమ్మతో ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ ‘వాడి గురించి ఏదో అనుకున్నాను చాలా బాగా నటించాడు ఫస్ట్ సినిమాల అనిపించట్లేదు అని చెప్పారట’ వాస్తవానికి నరేష్ కి కూడా ఆ కథ షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత చెప్పారట. 18వ తారీకు ఆడిషన్ చేస్తే 22వ తారీకు నుంచి షూటింగ్ మొదలుపెట్టేసారు. 24 వ తారీఖున నరేష్ కథ చెప్పారట రవిబాబు. సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అందరూ కూడా సెటిల్.
Also Read : Telugu Heros: ఒకే సంవత్సరంలో 12 మంది హీరోల పరిచయమయ్యారు, ఇండస్ట్రీలో ప్రస్తుత పొజిషన్