E-Paper
Advertisement

Mahesh Kumar Goud: డీఎస్ నా రాజకీయ గురువు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: డీఎస్ నా రాజకీయ గురువు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Advertisement

Mahesh Kumar Goud: కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని.. ఆయన మరణం చాలా ఆశ్చర్యకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణం నాకు తీరని లోటు అని పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం ప్రమాణస్వీకార సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాజీ కాంగ్రెస్ నాయకులు డి శ్రీనివాస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

మహేష్ కుమార్ గౌడ్ బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ నిబద్ధతను తెలియజేశారు. డీఎస్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల నియమించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాలో బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీ సామాజిక వర్గానికి కేటాయించామని వెల్లడించారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో చరిత్ర సృష్టించిందని గౌడ్ గుర్తుచేశారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు కలిపి మొత్తం 75 శాతం పదవులను కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

ఈ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గాల ఐక్యత ఆవశ్యకతను గురించి చెప్పారు. బీసీలు అందరూ తప్పకుండా ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలన్నీ ఒకే వేదిక పైకి వచ్చి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

ALSO READ: IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 340 ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు, డోంట్ మిస్

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×