E-Paper
Advertisement

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!
Advertisement

Shiva Nirvana Next Movie:ఇరుముడి.. బాక్సాఫీస్ దగ్గర ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడితే చాలు సౌండ్ ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపిస్తుంది.మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించి, ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో గ్రాండ్ గా దూసుకుపోతుంది.

ఒకప్పుడు ‘నిన్ను కోరి’ (జులై 7, 2017), ‘మజిలీ’ (ఏప్రిల్ 5, 2019), ‘టక్ జగదీష్’ (సెప్టెంబర్ 10, 2021) అలాగే విజయ్ దేవరకొండ కాంబో ‘ఖుషి’ (సెప్టెంబర్ 1, 2023) లాంటి చిత్రాలతో క్లాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ డైరెక్టర్‌గా పేరొందిన శివ నిర్వాణ.. ‘ఇరుముడి’తో తనలోని ఊరమాస్ టేకింగ్‌ను చూపించి సౌత్ సినీ ఇండస్ట్రీ దృష్టిని తన వైపుకి తిప్పుకున్నారు.

Advertisement

వెర్సటైల్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ

ఇక ఈ సూపర్ సక్సెస్ తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందనే క్యూరియాసిటీ అంతటా కనిపిస్తుంది.మొదట్లో నందమూరి బాలకృష్ణ, తమిళ స్టార్ సూర్య పేర్లు వినిపించినప్పటికీ, ఇప్పుడు అంతకంటే క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ అండ్ కోలీవుడ్ సర్కిల్స్‌లో తెగ సర్క్య్యులేట్ అవుతుంది.

Advertisement

అవును … వెర్సటైల్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ త్వరలోనే ఓ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడంటూ కోలీవుడ్ కోడై కూస్తుంది.’ఇరుముడి’ ఘనవిజయం సాధించడంతో ధనుష్ ఆ సినిమాను చూసి ఫిదా అయి ఈ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది.అంతేకాదు, మూవీలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన ధనుష్, శివ నిర్వాణ ద్వారా వీడియో కాల్ మాట్లాడి మరీ అభినందించడం మనం చూశాం కూడా.

టాలీవుడ్‌లో తిరుగులేని మార్కెట్ క్రియేట్

ఇప్పటికే తెలుగు దర్శకులతో వరుస హిట్లు కొడుతున్న ధనుష్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘సార్’ (ఫెబ్రవరి 17, 2023) సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా, శేఖర్ కమ్ములతో చేసిన పాన్ ఇండియా మూవీ ‘కుబేర’తో టాలీవుడ్‌లో తిరుగులేని మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు కూడా . ఈ క్రమంలోనే శివ నిర్వాణ వినిపించిన ఒక డిఫరెంట్ లైన్‌కు ధనుష్ బాగా కనెక్ట్ అయ్యారని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది.

ALSO READ:మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ఇక ధనుష్ విషయానికి వస్తే  రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో  ‘ఓం’ సినిమాతో పాటు డైరెక్టర్ వెట్రిమారన్‌తో ‘తమిళ మురుగన్’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే.ఇది పూర్తయిన వెంటనే శివ నిర్వాణ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ ఎమోషన్స్‌ను పండించడంలో శివ నిర్వాణ ముద్ర, ఎలాంటి పాత్రనైనా జీవించేసే ధనుష్ నటన కలిస్తే బాక్సాఫీస్ దగ్గర మరోసారి మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని లెక్కలు వేస్తున్నారు మూవీ లవర్స్ .చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో !

Tags

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×